స్టార్స్ లవ్ అఫైర్స్ ను ఆయన డిసైడ్ చేస్తాడట

Mon May 27 2019 17:09:52 GMT+0530 (IST)

బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ గా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు స్టార్స్ మేకర్ గా దర్శక నిర్మాత కరణ్ జోహార్ కు పేరుంది. ఈయన బ్యానర్ లో సినిమాలు చేసిన వారు స్టార్స్ అవుతారనే టాక్ ఉంది. అంతటి పేరున్న కరణ్ జోహార్ పై ఎప్పటికప్పుడు విమర్శలు వస్తూనే ఉంటాయి. తాజాగా కరణ్ జోహార్ యంగ్ హీరో ఇషాన్ ను తొక్కేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ హీరోయిన్ కంగనా రనౌత్ సోదరి రంగోలి చండేల్ షాకింగ్ విమర్శలు చేసింది.షాహిద్ కపూర్ అయిన ఇషాన్ ను వెండి తెరకు కరణ్ జోహార్ 'ధడక్' చిత్రంతో పరిచయం చేశాడు. అప్పటి నుండి కూడా ఇషాన్ ను కరణ్ జోహార్ తనకు ఇష్టం వచ్చినట్లుగా ఆడిస్తున్నాడని.. నువ్వు ఆ హీరోయిన్ కు బ్రేకప్ చెప్పి.. నేను చెప్పిన హీరోయిన్ తో రిలేషన్ లో ఉండు అంటూ ఆదేశిస్తున్నాడట. ఇషాన్ ను పలు విధాలుగా కరణ్ జోహార్ వేధిస్తున్నాడని రంగోలి చండేల్ చెప్పుకొచ్చింది.

రంగోలి చండేల్ వ్యాఖ్యలను సమర్ధిస్తూ నటుడు.. సినీ విమర్శకుడు అయిన కమల్ ఆర్ ఖాన్ కూడా కరణ్ జోహార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. కరణ్ జోహార్ అలాంటే వ్యక్తే.. ఆయన అలా ప్రవర్తిస్తాడంటే నేను నమ్ముతున్నాను. స్టార్స్ వ్యక్తిగత స్వేచ్చను అతడు హరించడంతో పాటు వారిని ఆర్ధికంగా కూడా వాడేసుకుంటాడంటూ కమల్ ఆర్ ఖాన్ ఆరోపించాడు. స్టార్స్ ను ఏదైనా కార్యక్రమంకు తాను స్వయంగా తీసుకు వెళ్లి అక్కడ ఇచ్చిన అమౌంట్ లో ఎక్కువ శాతం తాను తీసుకుని కొద్ది మొత్తం మాత్రమే వారికి ఇస్తాడని ఆరోపణలు చేశాడు.

ఇషాన్ కట్టర్ ఏదో సమయంలో కరణ్ జోహార్ మాట విని ఉండడు. అందుకే ఇకపై ధర్మ ప్రొడక్షన్ లో వచ్చే ఏ సినిమాలో కూడా అతడు కనిపించడు. ఇషాన్ పై కరణ్ కక్ష సాధించేలా వ్యవహరిస్తాడని కూడా ఈ సందర్బంగా రంగోలి వ్యాఖ్యలు చేసింది. హీరో హీరోయిన్స్ అఫైర్స్ డిసైడ్ చేయడం వారి కెరీర్ ను డిసైడ్ చేయడం వంటివి కరణ్ జోహార్ చేస్తూ వారి జీవితాలతో ఆడుకుంటున్నాడంటూ రంగోలి సంచలన ఆరోపణలు చేసింది.