పవన్ రికార్డునూ లాగేసిన చరణ్

Mon Apr 16 2018 16:48:23 GMT+0530 (IST)


బ్లాక్ బస్టర్ అనే మాట తరచుగ వినిపిస్తూనే ఉంటుంది. కంటెంట్ ఎలా ఉన్నా సక్సెస్ మీట్స్ చెప్పి చెప్పేసుకుంటున్నారు. అయితే ఇండస్ట్రీ హిట్స్ మాత్రం అడపా దడపా మాత్రమే వస్తాయి. బయ్యర్స్ అందరికీ కళ్లు చెదిరే లాభాలను పంచి.. అన్ని రికార్డులను తుడిచిపెట్టేసే సినిమాలు అరుదుగా మాత్రమే వస్తాయి.మగధీర మూవీతో నైజాంలో హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డును నమోదు చేసిన రామ్ చరణ్ రికార్డు.. సుదీర్ఘ కాలం అలాగే ఉంది. ఆ తర్వాత అత్తారింటికి దారేది మూవీతో.. పవన్ కళ్యాణ్ కొత్త రికార్డును సృష్టించగలిగాడు. ఆ తర్వాత భారీ హిట్లు.. బ్లాక్ బస్టర్లు పడినా.. బాహుబలి సిరీస్ మినహా నైజాంలో అత్యధిక వసూళ్ల రికార్డు మాత్రం అత్తారింటికి దారేది పేరు మీదే ఉండిపోయింది. మళ్లీ ఇప్పుడు అబ్బాయ్ రామ్ చరణ్ తన రంగస్థలం మూవీతో.. బాబాయ్ అత్తారింటికి దారేది చిత్రానని అధిగమించగలిగాడు.

ఇప్పటివరకూ నైజాంలో 23 కోట్ల రూపాయల షేర్ ను రాబట్టి.. ఈ ఏరియాలో అత్యధిక వసూళ్లు సాధించిన నాన్ బాహుబలి మూవీ రికార్డును రంగస్థలం సొంతం చేసుకుంది. ఇంకా చాలా స్ట్రాంగ్ గా ఈ ఏరియాలో రన్ అవడం చూస్తుంటే.. కొత్త సినిమాలు వచ్చినా మరికొన్ని కోట్లు కొల్లగొట్టేయడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.