Begin typing your search above and press return to search.

ఓవర్సీస్ బ్లాక్ బస్టర్ లెక్క మారినట్టే

By:  Tupaki Desk   |   15 May 2018 5:11 AM GMT
ఓవర్సీస్ బ్లాక్ బస్టర్ లెక్క మారినట్టే
X
తెలుగు సినిమా హిట్ రేంజిని నిర్ణయించడంలో రెండు రాష్ట్రాల్లో వసూళ్లతోపాటు ఓవర్సీస్ కలెక్షన్లు చాలా ఇంపార్టెంట్ గా మారాయి. యూఎస్ బాక్సాఫీస్ వద్ద సినిమా ఎంత వసూలు చేసిందనే దానిని బట్టి సినిమా స్టామినా లెక్క కట్టేస్తున్నారు. గత మూడేళ్లగా యూఎస్ లో 2 మిలియన్ వసూలు చేయడం అంటే అత్యంత అరుదైన రికార్డుగా లెక్కేస్తున్నావారు. బాహుబలి రికార్డులు మినహాయిస్తే మూడేళ్ల కేవలం ఐదు సినిమాలు మాత్రం ఈ అరుదైన్ ఫీట్ సాధించగలిగాయి.

శ్రీమంతుడు - అ..ఆ - ఖైదీ నెంబర్ 150 - ఫిదా -నాన్నకు ప్రేమతో సినిమాలు 2 మిలియన్ మార్క్ ను రీచ్ అవగలిగాయి. ఓవర్సీస్ లో బ్లాక్ బస్టర్ కు ఇది బెంచ్ మార్క్ గా ఉండేది. ఈ బెంచ్ మార్క్ మార్చాల్సిన టైం వచ్చేసింది. ఎందుకంటే ఈ ఏడాది ఇంతవరకు రిలీజైన నాలుగు భారీ సినిమాలు ఈ ఫీట్ సాధించేశాయి. అజ్ఞాతవాసి - రంగస్థలం - భరత్ అనే నేను - మహానటి సినిమాలు నాలుగూ యూఎస్ బాక్సాఫీస్ వద్ద 2 మిలియన్ల కలెక్షన్లు రాబట్టాయి. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన రంగస్థలం 3.5 మిలియన్ల కలెక్షన్లు దక్కించుకుంది. భరత్ అనే నేను దాదాపు 3.4 మిలియన్ల వసూళ్లు సాధించింది.

అజ్ఞాతవాసి మూవీ ఈ ఏడాది తొలి డిజాస్టర్ గా పేరు తెచ్చుకుంది. ఈ సినిమా అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచినా 2 మిలియన్లు వసూలు చేయగలిగిందంటే అది పవన్ - త్రివిక్రమ్ ల కాంబినేషన్ స్టామినా అనే చెప్పాలి. ఈ కలెక్షన్ల ట్రెండ్ గమనిస్తే మూడు మిలియన్ డాలర్లు వసూలు చేయగలిగితేనే ఓవర్సీస్ లో బ్లాక్ బస్టర్ గా లెక్కేయాల్సి ఉంటుంది. మొత్తంమీద 2018 తెలుగు రేంజిని పెంచింది. స్టామినా ఏమిటో చాటిచెప్పింది. ప్రేక్షకులను మెప్పిస్తే ఏ రేంజి కలెక్షన్లు సాధ్యమో ప్రూవ్ చేసింది. టాలీవుడ్ లో ముందుముందు ఎన్ని సినిమాలు ఈ బెంచ్ మార్క్ టచ్ చేస్తాయో చూడాలి.