Begin typing your search above and press return to search.

రంగస్థలం ఓ క్లాసిక్ అంటున్న చిరు

By:  Tupaki Desk   |   16 Nov 2017 6:17 AM GMT
రంగస్థలం ఓ క్లాసిక్ అంటున్న చిరు
X
రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ రంగస్థలం 1985. ముప్ఫై ఏళ్ల క్రితం నాటి కథతో పీరియాడిక్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంపై ఇండస్ట్రీ అంతటా ఆసక్తి ఉంది. ఇప్పటివరకూ సిటీ బేస్డ్ సినిమాలే తీసిన ఇంటెలిజెంట్ డైరెక్టర్ సుకుమార్.. తొలిసారిగా పూర్తి స్థాయిలో పల్లెటూరి నేపథ్యంలో మూవీ తీస్తుండడం ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది.

ప్రస్తుతం హీరోయిన్ సమంత కూడా షూటింగ్ కు అవుతుండడంతో.. రంగస్థలం షూటింగ్ ను ఫుల్ స్పీడ్ లో పూర్తి చేసేస్తున్నారు. అయితే.. ఇంకా పలు సన్నివేశాలతో పాటు.. నాలుగు పాటలను కూడా చిత్రీకరించాల్సి ఉందట. కానీ ఇప్పటివరకూ పూర్తయిన భాగానికి రషెస్ ను ప్రత్యేకంగా చూశారట మెగాస్టార్ చిరంజీవి. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళితో కలిసి.. చిరు స్పెషల్ గా స్క్రీనింగ్ వేయించుకుని మరీ రషెస్ చూడడం విశేషం. ఓ క్లాసిక్ రేంజ్ లో ఈ మూవీ తెరకెక్కించిన వైనం చూసి చిరంజీవి థ్రిల్ అయిపోయారని తెలుస్తోంది. టాలీవుడ్ లో ది బెస్ట్ అనదగ్గ చిత్రాల్లో నిలుస్తుందని చిరు అనడంతో.. రంగస్థలం యూనిట్ అంతా ఫుల్ ఖుషీలో ఉన్నారట.

మరోవైపు రాజమౌళి కూడా రంగస్థలం ఔట్ పుట్ చూసి చాలా ఎక్సయిట్ అయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ఓ విజువల్ ట్రీట్ లా నిలుస్తుందని.. ఫ్యాన్స్ తో పాటు తెలుగు ఆడియన్స్ అందరినీ అలరిస్తుందని కామెంట్ చేశాడట దర్శక ధీరుడు. ఇండస్ట్రీ దిగ్గజాల నుంచి ఇలాంటి కామెంట్స్ రావడంతో.. ఇప్పుడు రంగస్థలం టీం తెగ హ్యాపీగా ఫీలయిపోతోంది. వచ్చే ఏడాది మార్చ్ నాటికి మెగా పవర్ స్టార్ మూవీ రంగస్థలం ను రిలీజ్ చేయాలన్నది టార్గెట్.