Begin typing your search above and press return to search.

పక్కా విలేజ్ మాస్ - ట్రైలర్ టాక్

By:  Tupaki Desk   |   18 March 2018 4:40 PM GMT
పక్కా విలేజ్ మాస్ - ట్రైలర్ టాక్
X
మెగా ఫాన్స్ ఎదురుచూపులకు తెర పడింది. ఇందాకా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో ట్రైలర్ ని విడుదల చేసారు. కథ పల్లెటూరి నేపధ్యంలో తీసిందనే క్లారిటీ ముందు నుంచి ఉంది కాని కథ గురించి మాత్రం ఎక్కువ క్లూ ఇవ్వకుండా ఇప్పటిదాకా జాగ్రత్త పడ్డారు. ట్రైలర్లో లైన్ ఏంటి అనేది స్పష్టంగా చెప్పేసారు. ఒక ఊరిని మూడు దశాబ్దాల తరబడి తన గుప్పిట్లో ఉంచుకున్న గ్రామ ప్రెసిడెంట్ ఏకచత్రాదిపత్యానికి గండి వేయడానికి పూనుకూన్న ఇద్దరు అన్నదమ్ముల కథగా ఇది తీర్చిదిద్దినట్టు చూపించేశారు. కుమార్ బాబుగా అన్నయ్య పాత్రలో ఆది పినిశెట్టి - చిట్టి బాబుగా తమ్ముడి పాత్రలో రామ్ చరణ్ కాంబో చాలా కొత్తగా ఉంది. ప్రెసిడెంట్ గా జగపతి బాబు విలనీని కళ్ళతోనే పండించగా అమాయకురాలైన రామ లక్ష్మిగా రామ్ చరణ్ ని గోముగా గాజులు అడిగే పాత్రలో సమంతా చాలా కొత్తగా ఉంది. ముందు నుంచి ఉన్న అంచనాల మేరకు ఈ ఇద్దరి కెమిస్ట్రీ ఓ రేంజ్ లో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.

రామ్ చరణ్ గురించి ఏదైతే ఫాన్స్ ఆశిస్తున్నారో అవన్నీ పక్కా లెక్కలు తూచి మరీ సుకుమార్ తీర్చిదిద్దినట్టు ప్రతి ఫ్రేం సాక్ష్యంగా నిలుస్తోంది. ముందు సరదాగా తిరిగే పాత్రలా చూపించి అన్నయ్య కోసం దేనికైనా తెగించే వాడిగా రెండు షేడ్స్ ని అద్భుతంగా పలికించాడు. ఆదితో ఎస్ఐని గుర్తుపెట్టుకో ఏసేద్దాం అని చెప్పడం, కుమార్ బాబుని తాకాలంటే ముందు నన్ను దాటాలి అని వార్నింగ్ ఇచ్చే సీన్, ట్రైలర్ చివర్లో చెవుల్లో చేరిన మాట గుండెల్లో ఉండిపోతుంది అని ఫైనల్ ట్విస్ట్ ఇవ్వడం అన్ని చరణ్ పాత్ర ఏ రేంజ్ లో ఉండబోతోందో సాంపిలే అదరహో అనే రేంజ్ లో ఉన్నాయి. ప్రకాష్ రాజ్ విలన్ గా కాకుండా కుమార్ - చిట్టిలను ప్రోత్సహించే సీనియర్ లీడర్ గా కనిపిస్తుండగా కెమెరా మెన్ రత్నవేలు పనితనం మాత్రం అత్యున్నత స్టాండర్డ్స్ లో కనిపిస్తోంది. అనసూయతో పాటు మిగిలిన పాత్రలు ఎక్కువ రివీల్ చేయకుండా జాగ్రత్తగా కట్ చేసిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది.

దేవి శ్రీ ప్రసాద్ థీమ్ మ్యూజిక్ - బ్యాక్ గ్రౌండ్ స్కోర్ - రామ్ లక్ష్మణ్ డిజైన్ చేసిన వాటర్ ఫైట్ చేజ్ ఇవన్ని ట్రైలర్ లో అలా అలా చూపించి ఫాన్స్ మరో పన్నెండు రోజుల దాకా సినిమా కోసం ఆగడం కష్టమే అనిపించేలా చేసారు. మార్చ్ 30 విడుదల మరోసారి ఖరారు చేస్తూ ట్రైలర్ చివర్లో డేట్ కూడా హై లైట్ చేసేసారు కనక ఇక కౌంట్ డౌన్ మొదలుపెట్టుకోవడమే సినిమా ప్రేమికుల పని.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి