Begin typing your search above and press return to search.

రంగస్థలం కోసం రీ షూటా?

By:  Tupaki Desk   |   12 Dec 2017 10:30 PM GMT
రంగస్థలం కోసం రీ షూటా?
X
సాధారణంగా సినిమా కథ ఎలా ఉన్నా టేకింగ్ బట్టి సినిమా సక్సెస్ అనేది ఉంటుంది. ఒక సారి కథను ఉహించుకున్నపుడు దర్శకుడు తాను ఊహించినట్టుగానే సినిమాను తెరకెక్కించాలని చూస్తాడు. కానీ సినిమా తెరపైకి వచ్చాక ఒక్కోసారి అనుకున్నంతగా రాకపోవచ్చు. దీంతో మళ్లీ సినిమాలోని కొన్ని సీన్స్ ని రీ షూట్ చేయక తప్పదు. అయితే ఈ తరహాలో చేయడం చిన్న సినిమాలకు కాస్త కలిసొచ్చినా పెద్ద సినిమాలకు అంతగా కలిసిరావు అనే సెంటిమెంట్ ఉంది.

ఒకసారి పూర్తి చేసిన సీన్స్ కరెక్ట్ గా రాలేదంటే బయట నెగిటివ్ టాక్ వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు రంగస్థలం కూడా అదే టాక్ ను అందుకుంటుందా అనే ఊహాగానాలు వ్యక్తమవుతన్నాయి. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కథ మొత్తం 1980 కాలంలో సాగుతుందని తెలిసిందే. ఇక సినిమా దాదాపు 70% ఫినిష్ అయ్యింది. కానీ సినిమాలో కొన్ని కీలకమైన సన్నివేశాలు మాత్రం దర్శకుడికి అనుమానం తెప్పిస్తున్నాయట. తన మేకింగ్ స్టైల్ అక్కడ మిస్ అవ్వడంతో సుక్కు మరోసారి ఆ సీన్స్ ని రీ షూట్ చేయాలని డిసైడ్ అయ్యారట. అందుకు రామ్ చరణ్ - సమంత ను మరోసారి కష్టపెట్టనున్నాడని తెలుస్తోంది.

వారుకూడా ఏ మాత్రం అడ్డు చెప్పకుండా దర్శకుడి మాటను వింటున్నారట. ఫైనల్ గా సినిమా అవుట్ బావుండాలని నిర్మాతలు కూడా ఇంకొంచెం ఖర్చు పెట్టడానికి వెనుకాడడం లేదు. ఎందుకంటే సినిమా ఓ మీడియం బడ్జెట్ లో సుక్కు ప్లాన్ చేశాడు. అంతే కాకుండా సినిమా బిజినెస్ కూడా ఎక్కువగానే జరగనుంది. విడుదల కాకముందే బడ్జెట్ డబ్బులు వచ్చ్చే అవకాశం ఉంది. దీంతో ఇంకా నాలుగు పైసలు పెట్టడంలో తప్పులేదని సినిమా బావుండాలని కష్టపడుతున్నారట. మరి ఆ సీన్స్ సినిమాకు ఎంత అవసరమే? ఎలా ఉంటాయో? తెలియాలంటే మార్చ్ వరకు ఆగాల్సిందే!