బాహుబలి తర్వాత చిట్టి బాబే

Tue Apr 17 2018 11:55:17 GMT+0530 (IST)

సౌండ్ ఇంజనీర్ చిట్టిబాబు వీరంగం ఇంకా కొనసాగుతూనే ఉంది. అది వచ్చాక చల్ మోహనరంగా-కృష్ణార్జున యుద్ధం లాంటి భారీ రిలీజ్ లు ఉన్నప్పటికీ తన స్టాండ్ ని స్టడీగా కొనసాగిస్తోంది రంగస్థలం. మొత్తం 17 రోజుల రన్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఖైది నెంబర్ 150 ఫుల్ రన్ కలెక్షన్స్ ని దాటేయడమే కాక బాహుబలి రెండు భాగాల తర్వాత తన పేరునే బాక్స్ ఆఫీస్ హిస్టరీలో రాసుకుంది. ఇప్పటి దాకా 180 కోట్ల గ్రాస్ కు అతి దగ్గరలో ఉన్న రంగస్థలం షేర్ రూపంలో 106 కోట్లను చేరుకోవడం చిన్న విషయం కాదు. మండిపోయే ఎండల్లో మూడో వారంలో కూడా స్ట్రాంగ్ గా ఉంటూ ట్రేడ్ ని ఆశ్చర్యపరుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కాకుండా దేశీయంగా చూసుకుంటే మొత్తం 88 కోట్ల 45 లక్షల గ్రాస్ తో ఇప్పటి దాకా 147 కోట్ల గ్రాస్ రాబట్టిన రంగస్థలం రానున్న పెద్ద సినిమాలకు భారీ టార్గెట్ ను సెట్ చేసింది. ఒక్క తెలుగు రాష్ట్రాలను మాత్రమే తీసుకుంటే 125 కోట్ల గ్రాస్ తో మొత్తం 78 కోట్ల 25 లక్షల షేర్ రాబట్టి ఆ రకంగానూ కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది.ఇప్పటి దాకా వచ్చిన 17 రోజుల కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి

నైజాం – 23 కోట్ల 30 లక్షలు

సీడెడ్ – 15 కోట్ల 20 లక్షలు

నెల్లూరు – 2 కోట్ల 90 లక్షల 55 వేలు

గుంటూర్ – 7 కోట్ల 50 లక్షలు

కృష్ణా – 6 కోట్ల 20 లక్షలు

వెస్ట్ – 5 కోట్ల 30 లక్షల 70 వేలు

ఈస్ట్ – 6 కోట్ల 68 లక్షలు

ఉత్తరాంధ్ర – 11 కోట్ల 17 లక్షలు

తెలుగు రాష్ట్రాలు (మొత్తం)- 78 కోట్ల 35 లక్షలు

కర్ణాటక – 8 కోట్లు

తమిళనాడు – 1 కోటి 20 లక్షలు

రెస్ట్ అఫ్ ఇండియా – 1 కోటి

మొత్తం భారతదేశం షేర్ – 88 కోట్ల 50 లక్షలు

యుఎస్ఎ – 13 కోట్ల 20 లక్షలు

రెస్ట్ అఫ్ వరల్డ్ – 4 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా మొత్తం షేర్ – 106 కోట్లు (సుమారుగా)

మరో మూడు రోజుల్లో భరత్ అనే నేను వస్తోంది కాబట్టి రంగస్థలం జోరుకు పెద్ద బ్రేకే పడనుంది. చెప్పుకోదగ్గ సంఖ్యలో థియేటర్లు రంగస్థలం అలాగే కంటిన్యూ చేయబోతున్నాయి కాబట్టి వసూళ్ళ లెక్కలో ఇంకాస్త మెరుగుదల ఉండొచ్చు. మొత్తానికి రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంది అన్న అంచనాలకు భిన్నంగా ఏకంగా నాన్ బాహుబలి రికార్డులన్నీ సొంతం చేసుకోవడం చూస్తే సౌండ్ ఇంజనీర్ దెబ్బ మామూలుగా లేదని ప్రూవ్ అయినట్టే.