Begin typing your search above and press return to search.

ఎముకల పోగులా మారిన స్టార్ హీరో

By:  Tupaki Desk   |   6 Feb 2016 4:32 AM GMT
ఎముకల పోగులా మారిన స్టార్ హీరో
X
ట్యాలెంటెడ్ నటుడిగా రణ్ దీప్ హుడాకు బాలీవుడ్ లో మంచి పేరు ఉంది. దర్శకుల హీరోగా గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు. ఇతడికి సినిమా పట్ల కమిట్మెట్ ఎక్కువ. సినిమా కోసం ఏదైనా చేసేసే రకం. కానీ ఓ మూవీ కోసం కండలు కరిగించడమే కాదు.. ఎముకల పోగులా మారిపోవడం ఎవరికైనా సాధ్యమా అనే ప్రశ్న తలెత్తుతుంది.

పాక్ జైల్లో 23 ఏళ్లపాటు చిత్రవధ అనుభవించిన సరబ్ జీత్ సింగ్ జీవితంపై బయోపిక్ తీసేందుకు నేషనల్ అవార్డ్ విన్నర్ ఓమంగ్ కుమార్ సిద్ధమయ్యాడు. ఈ కేరక్టర్ కు తగిన నటుడిగా.. రణ్ దీప్ హుడాను భావించి అప్రోచ్ అయ్యాడు. కానీ ఈ పాత్రను రణ్ దీప్ చేస్తాడో లేదో అని అనుమానమేనట. ఎందుకంటే.. బాడీలో విపరీతమైన మార్పును చూపించాల్సి ఉంటుంది. అలా చేయాలంటే.. పూర్తి స్థాయిలో కమిట్ మెంట్ ఉన్నవారికే సాధ్యం. కానీ సరబ్ జీత్ పాత్రను తాను చేస్తానని ముందుకొచ్చాడు రణ్ దీప్ హుడా.

28 రోజుల్లో 18 కిలోల బరువు తగ్గిపోయాడు ఈ హీరో. గత కొన్ని రోజులుగా అయితే కేవలం మంచినీటితోనే బతుకుతున్నాడట. అలా తాను పెంచిన ప్యాకులన్నిటినీ కరిగించేసి, ఇలా ఎముకలు బైట పెట్టాడు. 23 ఏళ్ల జైలు జీవితాన్ని చూపించనుండడంతో.. పలు రకాల లుక్స్ తో ఈ మూవీలో కనిపించనున్నాడు రణ్ దీప్ హుడా. ఒక మూవీ కోస ఇలా కడుపు కాల్చుకుని సన్నబడిపోయిన రణ్ దీప్ ఫస్ట్ లుక్ కి, బాలీవుడ్ జనాల నుంచి విపరీతమైన ప్రశంసలు వస్తున్నాయి.