Begin typing your search above and press return to search.

మనోడితో కలసి పాక్ భామ పొగతాగుతోందే

By:  Tupaki Desk   |   22 Sep 2017 6:04 AM GMT
మనోడితో కలసి పాక్ భామ పొగతాగుతోందే
X
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ లవ్ స్టోరీలు ఎప్పుడూ ఓపెన్ గా ఉంటూంటాయి. స్టార్ భామలతో ఇతడు నడిపే సల్లాపాల గురించి మీడియాలో బాగానే వార్తలు వస్తుంటాయి. మొదట దీపికా పదుకొనే.. ఆ తర్వాత కత్రినా కైఫ్ వంటి అందాల భామలతో లవ్ స్టోరీలు నడిపేసి.. తీరిగ్గా బ్రేకప్ లు కూడా చెప్పేసున్న ఇతడు.. ప్రస్తుతం పాకిస్తానీ హీరోయిన్ మహిరాఖాన్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడనే టాక్ ఉంది.

షారూక్ ఖాన్ రయీస్ మూవీతో ఇండియన్ ఆడియన్స్ కు చేరువైన మహిరా ఖాన్.. రణబీర్ తో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతోందనే టాక్ ఉంది కానీ.. వీళ్ల లవ్ స్టోరీని కన్ఫాం చేసే సాక్ష్యం ఏదీ లభించలేదు. అయితే.. ఈ భామ ఇప్పటికే డైవోర్సీ కూడా అనే విషయం గుర్తుంచుకోవాలి. పైగా ఓ బిడ్డకు తల్లి కూడా. అయినా సరే అందాల మోత మోగించడంలో మహిరాకు ఎలాంటి అబ్జెక్షన్స్ ఉండవు. అంతే కాదు.. గ్లామర్ గా కనిపించడంపై క్వశ్చన్స్ అడిగితే.. ఇండియన్ మీడియాకు దిమ్మ దిరిగే ఆన్సర్ కూడా ఇచ్చింది. రీసెంట్ గా ఈ మహిరాఖాన్- రణబీర్ కపూర్ లు న్యూయార్క్ చక్కర్లు కొడుతూ ఫోటోలకు చిక్కారు. అంతే కాదు.. ఇద్దరూ కలిసి తెగ పొగ లాగించేస్తున్నారు.

మహిరా నోటికి సిగరెట్ అందించి మరీ పొగ వెలిగిస్తున్నాడు రణబీర్. అయితే.. ఆ పొగ కంటే.. అమ్మడు ఓ చిన్నపాటి గౌన్ తో గ్లామర్ షో చేసేస్తూ చూపిస్తున్న అందాలు మాత్రం.. చూపరుల గుండెలను మత్తులో ముంచేస్తున్నాయి.