2019లో మరో పెళ్లి.. జూన్ లో నిశ్చితార్థం

Fri Jan 11 2019 23:41:35 GMT+0530 (IST)

2018 పెళ్లిళ్లతో వేడెక్కిపోయింది. సెలబ్రిటీ వెడ్డింగ్స్ హీటెక్కించాయి. అనుష్క శర్మ - శ్రీయ - దీపిక పదుకొనే - సోనమ్ కపూర్ వంటి అందగత్తెలు పెళ్లి చేసుకుని ఓ ఇంటివాళ్లయిపోయారు. 2019 సన్నివేశమేంటి? ఈ ఏడాదిలో పెళ్లి బంధంతో లాక్ అయ్యే కథానాయికలు ఎవరు? అని ఆరాతీస్తే ఇప్పటికే ఎమీజాక్సన్ తన బోయ్ ఫ్రెండ్ జార్జి పనాయటౌని పెళ్లాడేందుకు రెడీ అవుతున్నానని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.తాజాగా మరో పేరు వెలుగులోకి వచ్చింది. తనదైన నటప్రతిభ - క్యూట్ అప్పియరెన్స్‌తో బాలీవుడ్ ని ఏల్తున్న కుర్ర బ్యూటీ ఆలియా భట్ ఈ ఏడాది తాను వలచిన సఖుడిని పెళ్లాడేందుకు రెడీ అవుతోంది. గత కొంతకాలంగా ఆలియాభట్- రణబీర్ సింగ్ ప్రేమాయణం వేడెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ జోడీ ప్రస్తుతం బ్రహ్మాస్త్ర చిత్రంలో నటిస్తున్నారు. ఫిక్షన్ సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆయన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. సెట్స్ పై ఉండగానే ఆ ఇద్దరిపైనా రూమర్లు మొదలయ్యాయి. రణబీర్ ప్రేమలో ఆలియా నిండా మునిగిందని అయితే ఇప్పటికే పలువురు కథానాయికలో ఎఫైర్లు సాగించిన రణబీర్‌ని ప్రేమించి తప్పు చేసిందని ప్రచారమైంది. అదంతా అటుంచితే ఓవైపు తనని హెచ్చరిస్తున్నా ఆలియా మాత్రం తన ప్రేమను కంటిన్యూ చేస్తూనే ఉంది. ఆ లవ్వాయణంపై ఆలియా డాడ్ మహేష్ భట్ సైతం పెళ్లి వరకూ వెళితే చూద్దాం అని ఓపెన్ గానే మాట్లాడారు.

ఆలియా సన్నివేశం ఇటీవల పూర్తిగా మారింది. ఇక పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిలయ్యేందుకు నిర్ణయించుకుందని వార్తలొస్తున్నాయి. ఆలియా రణబీర్ కుటుంబ సభ్యులకు బాగా క్లోజ్ అయిపోయింది. అతడి తల్లి నీతూ కపూర్ - తండ్రి రిషీ కపూర్ - సోదరి రిద్ధిమ వంటి వాళ్లకు ఆలియా బాగా క్లోజ్ అయిపోయింది. ఎంతగా అంటే ఆలియా మా `ఫ్యామిలీ` అంటూ మురిసిపోయేంతగా. ఆలియా సైతం ఆ కుటుంబ సభ్యుల్ని సొంత మనుషులుగానే చూస్తోంది. అందుకే రణబీర్ తల్లి నీతూ తొందరపడుతున్నారట. బ్రహ్మాస్త్ర చిత్రీకరణ పూర్తయిపోతే ఇక తనయుడికి పెళ్లి చేయాలని భావిస్తున్నారు. తనకు ఆలియా సరిజోడు అని భావించి నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేస్తున్నారట. జూన్ 2019 లో నిశ్చితార్థం జరుగుతుందని ప్రఖ్యాత మిడ్ డే ఓ కథనం ప్రచురించడం సంచలనమైంది.

ఇటీవలే గల్లీ బోయ్ ప్రచార కార్యక్రమంలోనూ ఆలియా తన స్పెషల్ మ్యాన్ గురించి ఓ హింటిచ్చింది. రణవీర్ సింగ్ - రణబీర్ కపూర్ ఇద్దరితో నటించావు కదా.. ఎవరు ఎక్కువ స్పెషల్ ? అని ప్రశ్నిస్తే .. అందులో ఒకరు (రణబీర్) ఎక్స్‌ట్రా స్పెషల్ అని - ఇంకొకరు (రణవీర్)అంత కాదని క్లూ ఇచ్చింది ఆలియా. అంటే రణబీర్ పై తనకు ఉన్న ప్రేమను వ్యక్తం చేసింది. అందుకే ఇక ఆలియా- రణబీర్ జోడీ వివాహానికి ఇరువైపులా పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయని సదరు కథనం పేర్కొంది. మొత్తానికి 2019లోనూ సెలబ్రిటీ వెడ్డింగ్స్ తో వేడెక్కబోతోందని తాజా సన్నివేశం చెబుతోంది.