డ్రగ్స్ వాడినట్లు ఒప్పుకున్న స్టార్ హీరో

Mon Jul 17 2017 21:58:53 GMT+0530 (IST)

డ్రగ్స్.. ఇప్పుడు తెలుగు సినిమా రంగాన్ని కుదిపేస్తున్న అంశం. ఇప్పటికే బైటకు వచ్చిన పేర్లు సంచలనం అయితే.. ఇకపై వినిపించబోయే పేర్లు అంటూ మరికొన్ని క్లూస్ చెబుతున్నారు. నిజంగా ఆయా వ్యక్తుల పేర్లు అన్నీ ఈ కేసులో భాగం అయితే మాత్రం.. టాలీవుడ్ లో అతి పెద్ద సంక్షోభంగా చెప్పచ్చు. సరిగ్గా ఇలాంటి సమయంలో తాను డ్రగ్స్ వాడానని ఓ స్టార్ హీరో బైటకు చెప్పడం సంచలనం అవుతోంది.

టాలీవుడ్ లో కాదు కానీ.. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ఇప్పుడిదే మాట చెబుతున్నాడు. ప్రస్తుతం ఈ హీరో నటించిన జగ్గా జాసూస్ రిలీజ్ కి సిద్ధం కాగా.. ఆ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న రణబీర్.. చిన్నప్పుడు తాను డ్రగ్స్ కు బానిస అయినట్లు చెప్పుకున్నాడు. ఆ తర్వాత డ్రగ్స్ వినియోగం ఎంత తప్పో తెలుసుకోవడంతో.. మెల్లగా వాటికి దూరం అయ్యాడట. అయితే.. పెద్దయ్యాక కూడా ఉద్దేశ్యపూర్వకంగానే ఓ సారి డ్రగ్స్ తీసుకోవాల్సి వచ్చిందని చెప్పాడు రణబీర్ కపూర్. అది కూడా ఓ సినిమా కోసం కావడం మరీ ఆశ్చర్యకరమైన విషయం.

రాక్ స్టార్ మూవీలో నటించే సమయంలో ఓ కీలకమైన సన్నివేశం కోసం.. నిజంగానే డ్రగ్స్ తీసుకున్నాడట. కాకపోతే బాగా తక్కువ డోసేజ్ లో.. తక్కువగా ఎఫెక్ట్ ఉండే డ్రగ్ తీసుకుని ఆ సీన్ లో నటించడంతో.. ఆన్ స్క్రీన్ పై పర్ఫెక్ట్ గా ఆ సీన్ పండిందని అన్నాడు రణబీర్. జగ్గా జాసూస్ కి ప్రమోషన్ కి చెప్పాడో.. లేక నిజంగానే వాడాడో చెప్పలేం కానీ.. ఇప్పుడు రణబీర్ డ్రగ్స్ వాడకం మాత్రం సెన్సేషన్ అయిపోతోంది.