Begin typing your search above and press return to search.

ఆ హీరో సంజయ్ దత్ లా మారిపోయాడోచ్

By:  Tupaki Desk   |   21 Feb 2017 8:05 AM GMT
ఆ హీరో సంజయ్ దత్ లా మారిపోయాడోచ్
X
బాలీవుడ్ లో సెట్స్ పై ఉన్న క్రేజీ సినిమాల్లో 'దత్' ఒకటి. సంజయ్ దత్ జీవితాన్ని టాప్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీ తెరకెక్కిస్తున్నాడు. మున్నాభాయ్ ఎంబీబీఎస్ నుంచి.. పీకే వరకూ తన అన్ని సినిమాల్లోనూ వైవిధ్యం చూపిన ఈ దర్శకుడు.. వివాదస్పద జీవితం గడిపిన బాలీవుడ్ హీరో సంజయ్ దత్ పై బయోపిక్ తీస్తున్నాడని తెలిసినప్పటి నుంచి ఈ మూవీపై విపరీతమైన హైప్ క్రియేట్ అయింది.

మరోవైపు సంజయ్ దత్ గా ఈ చిత్రంలో యంగ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటిస్తున్నాడు. సంజయ్ దత్ జీవితంలోని అన్ని కోణాలను చూపిస్తామని దర్శకుడు ముందే చెప్పడంతో.. అసలు ఈ కేరక్టర్ లో రణబీర్ ఎలా ఉంటాడనే ఆసక్తి ఎక్కువైపోయింది. ఇప్పుడు సంజయ్ దత్ లా మారిపోయిన రణబీర్ కపూర్ ఫోటోలు.. సెట్స్ నుంచి లీక్ అయ్యాయి. 1990ల నాటి కాలంలో సంజయ్ దత్ ఎలా ఉండేవాడో.. ఎలాంటి బాడీ మెయింటెయిన్ చేసేవాడో.. హెయిర్ స్టైల్ ఎలా ఉండేదో.. డ్రెసింగ్ ఎలా కనిపించేదో.. అచ్చం అలాగే మారిపోయిన రణబీర్ కపూర్ ఫోటోలు రచ్చ చేసేస్తున్నాయి.

మరోవైపు 'దత్' మూవీలో సంజయ్ దత్ తండ్రి సునీల్ దత్ గా పరేష్ రావల్.. తల్లి నర్గీస్ గా మనీషా కొయిరాలా.. సంజయ్ భార్య మాన్యతా దత్ గా దియా మీర్జా నటిస్తుండగా.. అనుష్క శర్మ.. సోనమ్ కపూర్ లు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/