Begin typing your search above and press return to search.

ఆ హీరో కి చుక్కలు చూపించిన వెబ్ సైట్

By:  Tupaki Desk   |   28 Oct 2016 7:30 AM GMT
ఆ హీరో కి చుక్కలు చూపించిన వెబ్ సైట్
X
సాధారణంగా చాలామంది హీరోలను కాని హీరోయిన్లను కాని.. మీరు పలానా వెబ్ సైట్ లో ఎంటర్టయిన్మంట్ న్యూస్ చదువుతారా అని అడిగితే? అబ్బే ఆ సైట్ పేరును కూడా నేను వినలేదే అంటుంటారు. కాని నిజానికి ఆ పర్టికులర్ సైట్లో ఒక్క ఆర్టికల్ వస్తే చాలు.. అది తీసేయమని వందలసార్లు ఫోన్లు.. పి.ఆర్.ఓ లతో పైరవీలు.. అబ్బో చాలా రచ్చ చేస్తారు. అయితే ఈ యాక్టర్ల గురించి ప్రముఖంగా రాసినప్పుడు ఫోన్ చేసి ఎప్రిషియేట్ చేయరు కాని.. నెగెటివ్ ఆర్టికల్ వస్తే చాలు.. గొడవలే.

సరిగ్గా ఇప్పుడు రణబీర్ కపూర్ విషయంలో అదే జరిగింది. మనోడు ఒకానొక టైములో వెబ్ సైట్లలో వచ్చే గాసిప్పుల్లో 80% నిజమే అని చెప్పాడు. అయితే మొన్న ఒక రోజును కేవలం పేర్లు రాయకుండా ఒక గాసిప్ రాసినందుకు.. 'ఏ దిల్ హైయ్ ముష్కిల్' ప్రమోషన్లలో పింక్ విల్లా.కామ్ అనే బాలీవుడ్ వెబ్ సైట్ ను మనోడు ఏకిపాడేశాడు. అంతేకాదు.. నవ్వుతూ ఫక్ అంటూ తిడుతూ.. మీకు దమ్ముంటే ఈ వీడియోను మీ వెబ్ సైట్ అండ్ యుట్యూబ్ ఛానల్ లో పెట్టండి అంటూ ఛాలెంజ్ కూడా చేశాడు. మనోడు మీడియాను.. ముఖ్యంగా వెబ్ సైట్ ను తక్కువగా అంచనా వేశాడేమో తెలియదు కాని.. వెంటనే పింక్ విల్లా వారు మొత్తం వీడియోను బూతులు మ్యూట్ చేసిన ఆన్ లైన్లో పెట్టారు. అంతే కాదు.. రణబీర్ కపూర్ అండ్ అనుష్క శర్మ గురించి రాసిన గొప్ప గొప్ప వ్యాసాల లింక్ షేర్ చేస్తూ.. వీటికి మెచ్చుకోని మీరు.. పేర్లు రాయకుండా రాసిన ఒక గాసిప్ కు మీకే ఆపాదించుకుని ఎందుకు రచ్చ చేస్తున్నారు అంటూ ప్రశ్నించారు.

ఇక నిజాయితీ గురించి అనుష్క శర్మ చేసిన కామెంట్లకు.. ఆమె ట్వీట్లతోనే జవాబు చెప్పింది పింక్ విల్లా. సుల్తాన్ సినిమాలో చేస్తోంది అంటూ రూమర్లు వచ్చినప్పుడు అనుష్క ఎలా ట్విట్టర్ సాక్షిగా అతి చేసింది.. తరువాత కొన్ని రోజుల తరువాత ఎలా ఆమె అదే న్యూస్ కన్ఫామ్ చేసింది.. ఆ వెబ్ సైట్ చెప్పేసింది. అంతేకాదు.. నీ హానెస్టీ ఏమైంది అంటూ ప్రశ్నించింది కూడా. మొత్తానికి ఆ బాలీవుడ్ వెబ్ సైట్ వీళ్లకు చుక్కలు చూపించిందనే చెప్పాలి. అయితే వీరి ఓవర్ యాక్షన్ ప్రభావం ఈరోజు రిలీజ్ అవుతున్న ఏ దిల్ హైయ్ ముష్కిల్ సినిమా రివ్యూలపై చూపించమని.. బాగుంటే బాగుందనే రాస్తాం అంటూ ఫినిషింగ్ లో ఇచ్చిన పంచ్ పేలిపోయింది అంతే.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/