Begin typing your search above and press return to search.

డ్రాగన్‌.. మన ఇండియన్‌ సూప‌ర్ హీరో

By:  Tupaki Desk   |   4 Sep 2015 6:23 PM GMT
డ్రాగన్‌.. మన ఇండియన్‌ సూప‌ర్ హీరో
X
స్పైడ‌ర్‌ మేన్‌, ఎక్స్‌ మేన్‌, మ్యాట్రిక్స్‌, బ్యాట్‌ మేన్.. ఒక‌టేమిటి హాలీవుడ్‌ లో బోలెడ‌న్ని సిరీస్‌ లు సూప‌ర్ హీరో క్యారెక్ట‌ర్ల‌తో తెర‌కెక్కి ఘ‌న‌విజ‌యం సాధించాయి. ఈ సినిమాల‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఇప్పుడు అదే బాట‌లో బాలీవుడ్ ప‌య‌నిస్తోంది. ఇప్ప‌టికే హృతిక్‌రోష‌న్‌, షారూక్‌ ఖాన్‌, వివేక్ ఒబేరాయ్ వంటి స్టార్లు సూప‌ర్ ప‌వ‌ర్స్ ఉన్న సూప‌ర్‌ మేన్ త‌ర‌హా క్యారెక్ట‌ర్ల‌లో న‌టించేశారు.

క్రిష్ సిరీస్‌, ధూమ్ సిరీస్ ఇవ‌న్నీ సూప‌ర్ ప‌వ‌ర్ ఉన్న సూప‌ర్‌ మేన్ సినిమాలే. బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల గ‌ళ‌గ‌ళ‌లు సృష్టించిన బ్లాక్‌ బ‌స్ట‌ర్ హిట్స్ ఇవ‌న్నీ. ఇప్పుడు హృతిక్‌, షారూక్‌ తో పోటీప‌డుతూ రేసులోకి కుర్ర‌హీరో ర‌ణ‌బీర్ క‌పూర్ కూడా దూసుకొస్తున్నాడు. డ్రాగ‌న్‌ లా వ‌స్తున్నాడు. ఆయ‌న ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న డ్రాగ‌న్ చిత్రంలో ర‌ణ‌బీర్ ఓ సూప‌ర్ ప‌వ‌ర్‌ గా న‌టించ‌బోతున్నాడు. అసాధార‌ణ శ‌క్తులున్న హీరోగా క‌నిపించ‌బోతున్నాడు.

డ్రాగ‌న్ సిరీస్‌ లో మొత్తం మూడు సినిమాలు వ‌స్తాయి. పురాణేతిహాసాల ఆధారంగా రాసుకున్న క‌థ ఇది. అయితే ఇది చైనా భాష‌ల్లో తెర‌కెక్కిన డ్రాగ‌న్ త‌ర‌హా సినిమానో, లేక ఇండియ‌న్ త‌ర‌హా డ్రాగ‌న్ సినిమానో ఆయ‌న్ ముఖ‌ర్జీ చెప్ప‌నేలేదు. హాలీవుడ్‌ లో హౌ టు ట్రెయిన్ యువ‌ర్ డ్రాగ‌న్ అనే సిరీస్ ఉంది. ఒక‌వేళ దానికి ఇన్‌స్పిరేష‌న్‌ గా ఈ సినిమా తీస్తున్నాడా? అన్న‌ది వేచి చూడాల్సిందే.