Begin typing your search above and press return to search.

మహేష్ బాబుకు రానా పాదాభివందనం

By:  Tupaki Desk   |   27 Nov 2015 6:04 AM GMT
మహేష్ బాబుకు రానా పాదాభివందనం
X
నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం. మహేష్ బాబుకు రానా దగ్గుబాటి పాదాభివందనం చేశాడు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిందో.. లేక అనుకోకుండా జరిగిపోయిందో కానీ.. ప్రిన్స్ కు రానా పాదాభివందనం చేయడం మాత్రం వాస్తవం. ‘భలే మంచి రోజు’ ఆడియో ఫంక్షన్లో చోటు చేసుకుందీ విచిత్రం. క్షణ కాలంలో ముగిసిపోయిన వ్యవహారం కావడంతో ఆ రోజు చాలామంది ఈ సంగతి గుర్తించనే లేదు. మీడియా కూడా దీని మీద పెద్దగా దృష్టిపెట్టలేదు.

ఆడియో వేడుకకు మహేష్ వచ్చి కూర్చున్న కొన్ని నిమిషాలకే రానా ఆడిటోరియంలోకి ఎంటరయ్యాడు. రాగానే సుధీర్ బాబుని హగ్ చేసుకుని.. ఆ తర్వాత మహేష్ దగ్గరికి వెళ్లాడు. ముందుకు వంగి మహేష్ పాదాన్ని తాకాడు. దీంతో మహేష్ ఒక్కసారిగా షాకై.. నవ్వేస్తూ అతణ్ని వారిస్తున్నట్లు చూశాడు. మహేష్ ఇంకా షాక్ లో ఉండగానే రానా వెళ్లి తన సీట్ లో కూర్చుండిపోయాడు.

చాలా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ రానా ఏమాత్రం భేషజం లేని కథానాయకుడన్నది అందరికీ తెలిసిన విషయమే. తోటి హీరోలతో చాలా క్యాజువల్ గా ఉంటాడు. తన మీద తనే జోకులేసుకుంటాడు. ‘బాహుబలి’ విషయంలో ప్రభాస్ ను వివిధ సందర్భాల్లో అతను గౌరవించిన తీరు చూసినా ఆశ్చర్యం కలిగించింది. ఇప్పుడు మహేష్ కు అతనిచ్చిన గౌరవం అతడి మీద జనాలకు ఇంకా మంచి ఇంప్రెషన్ కలిగించింది.