Begin typing your search above and press return to search.

బాబాయ్ పంచెలు ఇక అబ్బాయివే

By:  Tupaki Desk   |   14 Sep 2017 5:18 AM GMT
బాబాయ్ పంచెలు ఇక అబ్బాయివే
X
బాహుబలి సినిమా తర్వాత భళ్లాలదేవుడు మొత్తం రూటు మార్చేశాడు. సినిమాల ఎంపికతోపాటు అప్పియరెన్స్ అండ్ లుక్ లో చాలా మార్పులు తీసుకొచ్చాడు. ఇటు సినిమాలతో పాటు అటు టీవీ షోను మంచి రేటింగ్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నాడు. తాజాగా తేజ డైరెక్షన్ లో నేనే రాజు - నేనే మంత్రి సినిమాలో హీరోగా నటించాడు. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ గా వచ్చిన ఈ మూవీలో రానా విరగదీశాడనే చెప్పాలి. ఈ మూవీలో రానా మొదటిసారి తెలుగు నేటివిటీ అయిన పంచెకట్టుతో కనిపించాడు.

నేనే రాజు - నేనే మంత్రి సినిమాతోపాటు అందులో రానా పంచెకట్టు కూడా అందరికీ నచ్చేసింది. అదీ కేవలం ప్రేక్షకులకు మాత్రమే కాదు.. అడ్వర్టైజర్లకు కూడా బాగా నచ్చినట్టే కనిపిస్తోంది. తాజాగా తమిళనాడులోని దుస్తుల తయారీ కంపెనీ రామ్ రాజ్ కాటన్ తమ బ్రాండ్ అంబాసిడర్ గా రానాను ఎంచుకుంది. కోయంబత్తూర్ కు చెందిన ఈ కంపెనీ కాటన్ ధోవతీలు - పంచెల తయారీలో ఫేమస్. విచిత్రం ఏమిటంటే నిన్నటివరకు ఈ బ్రాండ్ కు తెలుగులో ప్రచారకర్తగా విక్టరీ వెంకటేష్ వ్యవహరించాడు. ఉన్నట్టుండి ఆ కంపెనీ ఎందుకో బాబాయ్ ను పక్కనపెట్టి అబ్బాయిని బ్రాంబ్ అంబాసిడర్ ను చేసింది. సాధారణంగా వెంకటేష్ చాలా తక్కువ బ్రాండ్లకే ప్రచారం చేస్తాడు. ఇప్పుడు అందులోనూ ఒకటి అబ్బాయి రానా పట్టుకెళ్లిపోయాడు.

నేనే రాజు - నేనే మంత్రి సినిమా తర్వాత రానా తమిళంపైనే ఫోకస్ ఎక్కువ పెట్టాడు. గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో ధనుష్ - లైం ఫేం మేఘా ఆకాష్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఎనై నోకి పాయుంతోట మూవీలో ఓ స్పెషల్ రోల్ చేస్తున్నాడు. దీంతోపాటు సత్యశివ డైరెక్షన్ లో మదై తిరందు మూవీలోనూ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా ఒకేసారి తెలుగు - తమిళ్ భాషల్లో షూటింగ్ అవుతోంది. తెలుగులో ప్రస్తుతం డైరెక్ట్ సినిమాలేవీ చేయకపోయినా నెం. 1 యారి షోతో వారంవారం ప్రేక్షకులను పలకరిస్తూనే ఉన్నాడు.