ఆ ఇద్దరు జంటగా కనిపించారే

Mon Jun 19 2017 19:56:58 GMT+0530 (IST)

సినిమాల్లో లవ్ స్టోరీలు ఎంత సహజమో.. ఇండస్ట్రీ అన్నాక ప్రేమకథలు ఎంత సహజం. అయితే తమ ప్రేమను బాహాటంగా చెప్పేవారు కొందరైతే.. మరికొందరు జస్ట్ ఫ్రెండ్స్ అంటూ గుంభనంగా వ్యవహరిస్తుంటారు. దగ్గుబాటి హీరో రానా.. చెన్నై బ్యూటీ త్రిషల మధ్య ఏదో ఉందని చాలా సార్లే వార్తలు వస్తుంటాయి.

వీరిద్దరూ తాము మంచి స్నేహితులం అని పైకి చెబుతున్నా.. అంతకు మించి ఇంకేదో ఉందని ఇండస్ట్రీ జనాలు అంటుంటారు. గతంలో వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచిందని కూడా ఓ టాక్ ఉంది. అయితే.. వీటన్నిటినీ రానా-త్రిషలు ఖండించారు. కొన్ని నెలల క్రితం సుచి లీక్స్ ఇష్యూలో కూడా రానా-త్రిష హాట్ టాపిక్ అయ్యారు. కొన్ని నెలలుగా ఎప్పుడూ జంటగా కనిపించని వీరిద్దరూ.. ఇప్పుడు ఫిలింఫేర్ అవార్డుల సాక్షిగా కలిసి కనిపించారు. ఈ ఈవెంట్ లో రానా-త్రిష పక్కపక్కనే కూర్చోవడం గురించి ఇండస్ట్రీ రకరకాలుగా చెప్పేసుకుంటోంది.

చాలా నెలల తర్వాత ఇద్దరూ ఒక ఫ్రేమ్ లో కనిపించడం.. సరదాగా కబుర్లు చెప్పుకోవడం వంటివి అందరినీ ఆకర్షించాయి. అయితే.. ఇలా ఓ ఫంక్షన్ లో పక్కనే కూర్చున్నంత మాత్రాన వారిద్దరి మధ్య లవ్ స్టోరీ ఉందని అనేయడం కష్టం కానీ.. ఇంతకు ముందు కూడా ఇలాంటి రూమర్స్ ఉండడంతోనే ఇప్పుడీ జంట అందరి కంటిలో పడిపోయింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/