రానా పెళ్ళి గురించి లీక్ ఇచ్చిన జక్కన్న!

Mon Dec 10 2018 14:04:56 GMT+0530 (IST)

'బాహుబలి' రెండు భాగాల విజయంతో నేషన్ వైడ్ పాపులారిటీ సాధించిన రాజమౌళి.. ప్రభాస్.. రానాలు ఈమధ్య కరణ్ జోహార్ నిర్వహించే 'కాఫీ విత్ కరణ్' కార్యక్రమానికి అతిథులుగా హాజరయ్యారు.  ఈ ఎపిసోడ్ ను ఈమధ్య షూట్ చేశారు కానీ ఇంకా ప్రసారం కాలేదు. కాఫీ విత్ కరణ్ షో అంటే.. అందులో అన్నీ టాపిక్స్ మాట్లాడతాడు పర్సనల్ టాపిక్స్ కూడా వదలడు.రానా.. ప్రభాస్ లు ఇద్దరూ ఎలిజిబుల్ బ్యాచిలర్సే గానీ పెళ్ళి మాట మాత్రం అసలు ఎత్తరనే సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఇద్దరి పెళ్ళి గురించి కరణ్ అడిగితే రాజమౌళి మధ్యలో కల్పించుకొని ప్రభాస్ కంటే మందే రానా ఒక ఇంటివాడవుతాడని చెప్పాడు.  దానర్థం..  రానా మ్యారేజ్ ఇప్పటికే ఫిక్స్ అయినట్టేనా? కరణ్ జోహార్ అసలే ఒక ఆన్సర్ చెప్తే దానికి లింకుగా పది ప్రశ్నలు వేసి ఇన్ఫర్మేషన్ రాబట్టే రకం. మరి రానాది  లవ్ మ్యారేజా.. లేదా రానా నాన్నగారు ఫిక్స్ చేసిన అరేంజ్డ్ మ్యరేజా అనేది కనుకున్నాడో లేదో.  మ్యారేజ్ టాపిక్ రానా మీదకు వెళ్ళింది కదా అని ప్రభాస్ పెళ్ళి సంగతి అడిగాడో లేదో ఈ ఎపిసోడ్ ప్రసారం అయితే గానీ తెలియదు.

జక్కన్న లీక్ చేసి ఊరుకున్నా.. రానాను ఇప్పుడు జనాలు పెళ్ళి విషయం గురించి అడగకుండా ఎలా ఉంటారు?  ఇప్పుడు రానా పెళ్ళి విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారడం ఖాయమే.