Begin typing your search above and press return to search.

ముంబై కి మకాం మారుస్తున్న రానా?

By:  Tupaki Desk   |   21 May 2019 8:55 AM GMT
ముంబై కి మకాం మారుస్తున్న రానా?
X
తెలుగు మాత్రమే కాకుండా హిందీ తమిళ భాషలను కూడా కవర్ చేసే టాలీవుడ్ హీరోల లిస్టులో రానా దగ్గుబాటి పేరు ఉంటుంది. హిందీలోనూ.. తమిళంలోనూ స్ట్రెయిట్ సినిమాల్లో నటించడం రానాకు చాలా కామన్. తాజాగా రానా బాలీవుడ్ ఫిలిం 'హౌస్ ఫుల్ 4' లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ తో పాటుగా రితీష్ దేశ్ ముఖ్.. బాబీ డియోల్ లాంటి హీరోలు నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు ప్రస్తుతం రానా హైదరాబాద్.. ముంబై అప్ & డౌన్ చేస్తూ ఉన్నాడు.

అయితే ఈ సినిమా షూట్ పూర్తయ్యే లోపు రానా ముంబైకి మకాం మార్చే అవకాశం ఉందట. కారణం ఏంటంటే ఎంటీవీ వారు 'ఏస్ ఆఫ్ స్పేస్' సెకండ్ సీజన్ కోసం హోస్ట్ గా వ్యవహరించేందుకు రానాను సంప్రదించారట. ఈ షో మొదటి సీజన్ కు వికాస్ గుప్తా హోస్ట్ గా వ్యవగారించాడు. ఒకవేళ సెకండ్ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించేందుకు రానా కనుక ఒప్పుకుంటే ఆ సీజన్ అయిపోయేంతవరకూ రానా ముంబైలోనే ఉండాల్సి వస్తుందట. బిగ్ బాస్ టైపులో ఇదో రియాలిటీ షో కావడం తో హోస్టుకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఈ రియాలిటీ షోలో పాల్గొనే వారికి కష్టమైన టాస్కులు ఇవ్వడం లాంటివి చేయాల్సి ఉంటుంది.

రానాకు టీవీ షోలకు హోస్ట్ చేయడం కొత్తేమీ కాదు. ఇప్పటికే 'నెం.1 యారీ విత్ రానా' షో రానాకు ఎంతో పేరు తీసుకొచ్చింది. అయితే అది తెలుగు ప్రేక్షకుల కోసం డిజైన్ చేసిన షో. ఈ 'ఏస్ అఫ్ స్పేస్' మాత్రం ప్యాన్ ఇండియా ఆడియన్స్ ను టార్గెట్ చేసున్న షో. మరి రానా ఈ షోకు ఒప్పుకుంటాడో.. ముంబైకి మకాం మారుస్తాడో లేదో వేచి చూడాలి.