Begin typing your search above and press return to search.

అబ్బ‌బ్బ‌... రానా ఏం సేవ్ చేశాడ‌బ్బా?

By:  Tupaki Desk   |   1 Oct 2016 6:19 AM GMT
అబ్బ‌బ్బ‌... రానా ఏం సేవ్ చేశాడ‌బ్బా?
X
రానాకి న‌టుడిగా సుదీర్ఘ‌మైన చ‌రిత్రేమీ లేదు. ఇప్పుడున్న యంగ్ హీరోల్లో చాలామందికంటే లేట్‌ గా తెర‌పైకొచ్చాడు. కానీ త‌న‌దైన వ్యూహంతో ద‌క్షిణాదితో పాటు - ఉత్త‌రాదిలోనూ మార్కెట్‌ ని సృష్టించుకొన్నాడు. సినిమాల విష‌యంలో ఆయ‌న‌కున్నంత నాలెడ్జ్ మ‌రే యంగ్ హీరోలోనూ క‌నిపించ‌దు. సినిమా రంగంలోనే పుట్టి పెరిగాడు కాబ‌ట్టి ఆయ‌న‌కి టెక్నిక‌ల్‌ గా కూడా మంచి నాలెడ్జ్ ఉంది. అందుకే ఏ వేదిక‌నెక్కినా త‌న స్పీచ్‌ తో అద‌ర‌గొడతాడు. ఆయ‌న మాట‌లు అనుభ‌వ‌జ్ఞుల్ని సైతం ఆశ్చ‌ర్యానికి గురిచేస్తుంటాయి.

నిన్న జ‌రిగిన `బాహుబ‌లి2` ప్రెస్‌ మీట్‌ లోనూ రానా మాట్లాడిన మాట‌లు మీడియానీ, ద‌ర్శ‌కుడు రాజ‌మౌళినీ ఆక‌ట్టుకొన్నాయి. కొన్ని సంద‌ర్భాల్లో ద‌ర్శ‌కుడు రాజ‌మౌళినే సేవ్ చేసేలా మాట్లాడాడు రానా. మామూలుగా ప్రెస్‌ మీట్ల‌లో మీడియా ర‌క‌ర‌కాల ప్ర‌శ్న‌ల్ని సంధిస్తుంటుంది. సాదాసీదా ద‌ర్శ‌కులైతే ఉక్కిరిబిక్కిర‌వుతుంటారు. ఆ సంద‌ర్భంలో చెప్ప‌కూడ‌ని విష‌యాల్ని కూడా బ‌య‌టికి చెప్పేస్తుంటారు. నిన్న కూడా రాజ‌మౌళిపై అలాగే ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిసింది. ఆ విష‌యాన్ని గ‌మ‌నించిన రానా మ‌ధ్య‌లో క‌లగ‌జేసుకొని స‌మాధానాలు ఇచ్చారు. రానా చెప్పిన స‌మాధానాల్ని వింటూ రాజ‌మౌళి ` రానా న‌న్ను బాగా సేవ్ చేస్తున్నాడు` అంటూ న‌వ్వేశారు. మీడియా వ‌ర్గాలు కూడా రానానా మ‌జాకా? అని మాట్లాడుకొన్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/