Begin typing your search above and press return to search.

తేజ మూవీలో లీడర్.. నిజమే!!

By:  Tupaki Desk   |   22 Jan 2017 4:49 AM GMT
తేజ మూవీలో లీడర్.. నిజమే!!
X
బాహుబలి ది బిగినింగ్ లో.. దగ్గుబాటి రానా చేసినది విలన్ రోల్. అయినా సరే.. హీరోతో దాదాపు సమానంగా ఇమేజ్ సంపాదించుకున్నాడని అనడంలో సందేహం అక్కర్లేదు. దాదాపుగా స్టార్ హీరో సంపాదించేసుకున్నాడనే అనాలి. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ఆఫర్లు క్యూ కట్టేస్తున్నాయి. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో రానా ఒక మూవీ చేస్తున్నాడు.

ఈ మూవీకి 'నేనే రాజు నేనే మంత్రి' అనే టైటిల్ ని ఫిక్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే.. ఈ మూవీలో రానా చేస్తున్న పాత్ర ఏంటనే అంశంపై ఇప్పటివరకూ క్లారిటీ లేదు. కానీ తేజ డైరెక్షన్ లో రానా చేస్తున్నది ఓ పొలిటికల్ స్టోరీ అని తెలుస్తోంది. ఇందులో పొలిటికల్ లీడర్ రోల్ లోనే కనిపిస్తాడట రానా. తాజాగా కొన్ని ఏరియాల నుంచి లీక్ అయిన షూటింగ్ ఫోటోలను చూసినా ఇదే విషయం అర్ధమవుతుంది.

అంతే కాదు.. ఈ సినిమాలో రానా చేసే పాత్రకు నెగిటివ్ షేడ్స్ కూడా ఉంటాయట. విలన్ ఇతనేనా అనిపించే రేంజ్ లో స్క్రిప్ట్ ఉంటుందని తెలుస్తోంది. రానా తన తొలి సినిమా లీడర్ లో కూడా పొలిటీషియన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇక.. ఇప్పుడు తేజ మూవీలో రానాకి జోడీగా కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. నవదీప్ ఓ కీలక పాత్ర చేయనున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/