Begin typing your search above and press return to search.

ఆత్మ అక్కడే ఉందంటున్న భల్లాలదేవ

By:  Tupaki Desk   |   24 Oct 2016 5:42 AM GMT
ఆత్మ అక్కడే ఉందంటున్న భల్లాలదేవ
X
బాహుబలి మూవీకి ప్రభాస్ ఎంత కీలకమో.. ప్రతి నాయకుడు భల్లాదేవుడి పాత్రలో నటించిన రానా కూడా అంతే కీలకం. విలన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే.. హీరో పాత్ర అంతగా ఎలివేట్ అవుతుందనే సంగతి తెలిసిందే. అందుకే బాహుబలి సిరీస్ కి సంబంధించినంత వరకూ ప్రభాస్- దగ్గుబాటి రానా లను రెండు పిల్లర్స్ గా చెప్పాల్సిందే. అయితే బాహుబలి2 ఫస్ట్ లుక్ లాంఛ్ సమయంలో రానా కనిపించకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. చాలామంది ఫ్యాన్స్ తెగ ఫీల్ అయిపోయారు కూడా.

బాహుబలి మేనియా ముందు.. ఫస్ట్ లుక్ మాయలో పడిపోయి ఈ ఈవెంట్ లో మిస్ అయిన సంగతిని మీడియా కూడా పెద్దగా ఫోకస్ చేయలేదు. అసలీ టాపిక్ నే పెద్దగా పట్టించుకోలేదు. ఈ విషయంలో జనాలు ఎంతగా ఫీలయ్యారో కానీ.. రానా మాత్రం అంతకంటే ఎక్కువగా ఫీలయిపోతున్నానంటున్నాడు. తేజ దర్శకత్వంలో కాజల్ తో రొమాన్స్ చేస్తూ ఓ సినిమాలో నటిస్తున్నాడు రానా. తమిళనాడులో కరైకుడి ప్రాంతంలో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. దగ్గుబాటి సురేష్ బాబు ఈ చిత్రానికి ప్రొడ్యూసర్.

'బాహుబలి ఫస్ట్ లుక్ లాంఛ్ కు హాజరు కానందుకు క్షమించమని కోరుతున్నా. తమిళనాడులో ఎయిర్ పోర్టుకు 3 గంటల ప్రయాణ దూరంలో ఉన్న ఓ చిన్న టౌన్ లో షూటింగ్ ఉన్నాను. షెడ్యూల్ బ్రేక్ చేసే పరిస్థితి లేదు. నా ఆత్మ మాత్రం అక్కడే ఉంది' అంటూ వ్యక్తిగా హాజరు కాకపోయినా.. బాహుబలి మూవీపై తన ప్రేమను మాత్రం ట్వీట్ రూపంలో చెప్పాడు రానా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/