Begin typing your search above and press return to search.

భ‌ళ్లాల దేవుడు ఈసారి కొత్తగా...

By:  Tupaki Desk   |   13 Oct 2015 7:30 AM GMT
భ‌ళ్లాల దేవుడు ఈసారి కొత్తగా...
X
ద‌గ్గుబాటి రానా ఒక‌ప్పుడు వేరు, ఇప్పుడు వేరు. అత‌డు ఎక్క‌డికి వెళ్లినా భ‌ళ్లాల‌దేవ‌గా ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో స్థానం సంపాదించుకున్నాడు. రుద్ర‌మ‌దేవి చిత్రంలో చాళుక్య వీర‌భ‌ద్రుడిగా రొమాంటిక్ రోల్ పోషించాడు. ఈ రెండు క్యారెక్ట‌ర్ల‌కు జ‌నాల్లో రిక‌గ్నైజేష‌న్ ఉంది. అందుకే అత‌డికి అన్నిచోట్లా క్రేజు రెట్టింపైంది. రానా ప్ర‌స్తుతం తమిళంలో బెంగ‌ళూర్ డేస్ రీమేక్‌ లో న‌టిస్తున్నాడు. ఆ సినిమా కోసం స్ట‌యిలిష్ అవ‌తార్‌ లో క‌నిపిస్తున్నాడు.

నిన్న‌టి రోజున సెంట్ర‌ల్ యూనివ‌ర్శిటీ ప్రాంగ‌ణంలో స్ట‌యిలిష్‌ గా ఒక ఫ్యాష‌న్ షోలో పాల్గొన్నాడు. మోడ‌ల్స్ మ‌ధ్య త‌ళుకుమ‌న్న ఈ కుర్ర హీరో ఓ టాప్ సీక్రెట్‌ ని రివీల్ చేశాడు. అస‌లు భ‌ళ్లాల దేవ‌గా భారీ దేహాకృతితో క‌నిపించిన రానా బాహుబ‌లి రెండో భాగంలో ఎలా క‌నిపించ‌బోతున్నాడు. మునుప‌టి రూపంతోనే తిరిగి క‌నిపిస్తాడా? లేక వేరే కొత్త రూపంతో ఆక‌ట్టుకుంటాడా? అన్న దానిపై జ‌నాల్లో ఇంట్రెస్టింగ్ టాపిక్ లేవ‌నెత్తాడు. రెండో భాగంలో కొత్త‌గా క‌నిపిస్తా .. క‌నిపెట్టండి ఆ కొత్త రూపం అంటూ స‌వాల్ విసిరాడు.

భ‌ళ్లాల‌దేవుడు అంటే క‌ర్క‌శ‌మైన రాజు. కాబ‌ట్టి అందుకు త‌గ్గ‌ట్టే అత‌డు మ‌న‌సు అన్న‌దే లేని క్రూరుడిగా క‌నిపించాలంటే మ‌రింత భీక‌రంగా క‌నిపించాలి. ఇంకా చెప్పాలంటే రోబో ల‌క్ష‌ణాల‌తో క‌నిపించే రాజులా ఉండాలి. రావ‌ణాసురుడిలా మ‌రిగిపోయేవాడై, రాక్ష‌స సంతతి రాజుగా వెలిగిపోయే వాడై ఉండాలి. కాబ‌ట్టి కొత్త అవ‌తారంలో హెయిర్ స్ట‌యిల్‌ - బాడీ షేపులు త‌దిత‌రాల‌న్నీ కొత్త‌గా చూపించాల్సిందే. సో.. గెట్‌ రెడీ.