Begin typing your search above and press return to search.

బాహుబలి చాలా దారులు తెరిచింది

By:  Tupaki Desk   |   21 March 2017 6:04 AM GMT
బాహుబలి చాలా దారులు తెరిచింది
X
ప్రస్తుత దగ్గుబాటి రానా ఫుల్ ఖుషీగా ఉన్న సంగతి తెలిసిందే. గత నెలలో రానా ప్రధాన పాత్రలో నటించన ఘాజీ చిత్రం సక్సెస్ కావడం.. తాజాగా రిలీజ్ అయిన బాహుబలి2 ట్రైలర్ కు అద్భుతమైన స్పందన లభించడం.. వచ్చే నెలలో బాహుబలి ది కంక్లూజన్ రిలీజ్ కానుండడంతో.. చాలా ఉత్సాహంగా ఉన్నాడా రానా.

తాజాగా చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్ లో పాల్గొన్న రానా.. ఘాజీ సక్సెస్ క్రెడిట్ కూడా బాహుబలికి ఇచ్చేశాడు. "ఒక ట్రైలర్ కు 85 మిలియన్ వ్యూస్.. ఈ నెంబర్ చూస్తేనే షాక్ వచ్చేస్తోంది. గతంలో తెలుగు తమిళ్ సినిమాలను హిందీలోకి డబ్ చేయడం అంటే కష్టంగా ఉండేది. ఇప్పుడు బాహుబలి చిత్రం గేట్లు తెరిచేసింది. ఘాజీ విజయం కూడా బాహుబలి కారణంగానే అనంటాను. అయితే.. ఐదేళ్లుగా భల్లాలదేవుడి పాత్ర కోసం కష్టపడ్డాను. ఇప్పుడా స్ట్రాంగ్ కేరక్టర్ ను మిస్ అవుతున్నానని అనిపిస్తోంది" అని చెప్పాడు రానా.

బాహుబలి చిత్రం దక్షిణాది సినిమా ముఖ చిత్రాన్నే మార్చేసిందని చెప్పిన రానా.. ' బాహుబలి2 ట్రైలర్ రిలీజ్ అయినపుడు నేను ముంబైలో ఉన్నాను. ఈ ఏడాది దేశంలో అతి పెద్ద సినిమాలు అంటూ ఓ బడా మేగజైన్.. ఫ్రంట్ పేజ్ లో పోస్టర్ వేయగా.. అందులో రజినీకాంత్.. అక్షయ్ కుమార్.. ప్రభాస్.. నా ఫోటోలు ఉన్నాయి. అందులో నలుగురిలో ముగ్గురు దక్షిణాదివాళ్లే' అంటూన్నాడు రానా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/