Begin typing your search above and press return to search.

రేపటి నుంచి బాహుబలి3కి రానా

By:  Tupaki Desk   |   24 Jun 2017 1:33 PM GMT
రేపటి నుంచి బాహుబలి3కి రానా
X
భారత దేశంలో చలనచిత్ర పరిశ్రమ ఉన్నంతకాలం బాహుబలి ఘనతలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. అంతటి ఘనవిజయం సాధించిన బాహుబలి.. రెండు భాగాలుగా వచ్చి ఇండియన్ సినిమా లెక్కలన్నిటినీ మార్చేసింది. కానీ ఈ రెండు భాగాలను తీసేందుకు ఐదేళ్లకు పైగా సమయం పట్టగా.. కొన్ని రోజులుగా బాహుబలి3 అనే మాట బాగానే హల్ చల్ చేస్తోంది.

బాహుబలి3 తీసుకొచ్చినా.. చూసేందుకు జనాలు రెడీగానే ఉన్నారు కానీ.. తీసేందుకు మేకర్స్ కి.. ముఖ్యంగా రాజమౌళి సాహసించడం లేదని చెప్పాలి. ఈ మూవీ షూటింగ్ కు అంత కాలం పట్టడమే అందుకు కారణం. రీసెంట్ గా భల్లాలదేవుడు రానా.. ట్విట్టర్ లో ఫాలోయర్స్ తో చిట్ చాట్ చేశాడు. ఈ సందర్భంగా 'బాహుబలి3 షూటింగ్ లో పాల్గొనేందుకు రమ్మని రాజమౌళి నుంచి పిలుపు వస్తే ఏం చేస్తారు' అనే ప్రశ్న ఎదురైంది. దీనికి 'రేపటి నుంచే నేను సిద్ధమవడం మొదలుపెడతాను' అంటూ ఆన్సర్ ఇచ్చాడు రానా.

ఈ ప్రాజెక్టుపై తనకు ఎంత మక్కువ ఉందనే విషయాన్ని ఒకే ఒక్క ఆన్సర్ తో చెప్పేశాడు భల్లాలదేవుడు. తాజాగా ఓ ఫోన్ సంభాషణలో.. బాహుబలి3 అనే మటా రాజమౌళి నోటి వెంట రాగానే.. 'అమ్మ నీయ*' అంటూ ప్రభాస్ షాక్ కు గురైన సంగతి తెలిసిందే. బాహుబలిలో విలన్ గా నటించిన రానా.. హీరోగా యాక్ట్ గా చేసిన మూవీ నేనే రాజు నేనే మంత్రి ఇప్పుడు రిలీజ్ కి రెడీ అవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/