Begin typing your search above and press return to search.

తాతగారిని గుర్తు చేసేలా ఉన్నాడే!

By:  Tupaki Desk   |   9 Nov 2018 12:53 PM GMT
తాతగారిని గుర్తు చేసేలా ఉన్నాడే!
X
రానా దగ్గుబాటి బాబాయ్ బాటలో హీరోగా ఎంట్రీ ఇచ్చి స్లోగా అడుగులేస్తూ ఫైనల్ గా 'బాహుబలి' భల్లాలదేవ క్యారెక్టర్ తో భారీ క్రేజ్ సాధించాడు. 'ఘాజీ'.. 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలో సోలో హీరోగా హిట్లు సాధించాడు. తర్వాత కూడా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులనే లైన్లో పెట్టాడు. ఇక 'ఎన్టీఆర్' సినిమాలో నారా చంద్రబాబు నాయుడు గారి పాత్రలో నటిస్తున్నాడు.

ఇదిలా ఉంటే రానా దగ్గుబాటి ఫ్యూచర్ ప్రాజెక్టు 'హిరణ్యకశ్యప' గురించి రానా నాన్నగారు డీ. సురేష్ బాబు ఈమధ్య మీడియాలో వెల్లడించిన విషయం హాట్ టాపిక్ గా మారింది. 'హిరణ్యకశ్యప' ను రానా నిర్మిస్తున్నాడని.. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో నిర్మించేందుకు భారీ సన్నాహాలు జరుగుతున్నాయని అయన తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ ఐదు డిఫరెంట్ లొకేషన్లలో భారీ టీమ్ తో జరుగుతోందట. రామానాయుడు స్టూడియోస్ గ్రాఫిక్ డిజైనర్లతో పాటుగా చాలామంది ఇతరులు కూడా ఈ ప్రాజెక్టుపై వర్క్ చేస్తున్నారట. ఈ ప్రిపరేషన్ చూస్తుంటే నిర్మాతగా రానాకు భారీ ప్లాన్లే ఉన్నాయని అర్థం అవుతోంది.

ఇప్పటికే 'కేరాఫ్ కంచరపాలెం' సినిమా ప్రమోషన్స్ లో రానా చూపించిన చొరవ తన మార్కెటింగ్ టెక్నిక్స్ అందరినీ ఆకర్షించాయి. ఇప్పుడేమో 'అమర్ చిత్ర కథ' తో పాటుగా 'హిరణ్య కశ్యప' ప్రాజెక్టు విషయంలో రానా డ్రీమ్స్ చూస్తుంటే నిర్మాతగా నాన్నగారి బాటలో నడుస్తూ తాత లెజెండరీ రామానాయుడు గారిని గుర్తుచేసేలా ఉన్నాడు. తాత.. నాన్న ఇద్దరూ నటన వైపు దృష్టి సారించలేదు. కానీ రానా అలాకాదు. వెంకటేష్ + సురేష్ బాబు = రానా. ఇంకా చెప్తే రామానాయుడు 2.0 వెర్షన్!!