Begin typing your search above and press return to search.

కజిన్స్ అంటే బెస్ట్ ఫ్రెండ్స్ అంటున్న రాణా

By:  Tupaki Desk   |   6 Feb 2016 5:30 AM GMT
కజిన్స్ అంటే బెస్ట్ ఫ్రెండ్స్ అంటున్న రాణా
X
భల్లాల దేవుడు రాణా నటించిన బెంగళూరు నాట్కాల్ కోలీవుడ్ లో విడుదల అయింది. మలయాళ మూవీ బెంగళూర్ డేస్ కి రీమేక్ ఇది. ఇందులు రాణా సీరియస్ గా ఉండే పాత్రను పోషించాడు. శ్రీదివ్య భర్త రోల్ లో ఎప్పుడూ గంభీరంగానే ఉంటాడు. అందరూ నవ్వుతున్నా రాణా మాత్రం సీరియస్ గానే ఉంటాడు. ఇందుకో ప్రత్యేకమైన కారణం ఉంటుంది.

స్టోరీ కజిన్స్ మధ్యలో నడిచే బెంగళూరు నాట్కాల్ షూటింగ్ ని తాను ఫుల్ గా ఎంజాయ్ చేశానన్నాడు రాణా. ఇందుకు కారణం తను కూడా కజిన్స్ తో కలిసి పెరగడమేనట. పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన రాణాకు.. అక్కినేని హీరో నాగచైతన్య కజిన్. 'తను నాకంటే రెండేళ్లు చిన్నవాడు. ఇంట్లో నేనే అందరికంటే పెద్ద. మా ఫ్యామిలీ - వెంకీ బాబాయ్ ఫ్యామిలీల్లోని పిల్లలతో కలిసి మొత్తం 8 మంది ఉండేవారం. అందరూ ఒకటిగానే గోల చేసేవాళ్లం. మేం అంతా మంచి ఫ్రెండ్స్' అంటున్నాడు రాణా.

తమ పెద్దవాళ్లు కూడా పిల్లలు అందరినీ ఒక రూమ్ లోనే వేసేసేవారని, తాము పెద్దయ్యాక కూడా ఇది కంటిన్యూ అయిందని రాణా చెప్పడం విశేషం. ఇప్పుడు కొందరికి పెళ్లి అయినా.. మళ్లీ అందరూ కలిస్తే మాత్రం పిల్లల్లాగా మారిపోతారట. మన జీవితంలో మన కజిన్సే అందరికంటే బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ తన స్వీట్ మెమరీస్ ని గుర్తు తెచ్చుకున్నాడీ దగ్గుబాటి హీరో.