1945: రానా లుక్ అదిరిపోయిందే.. !

Sun Feb 17 2019 12:08:32 GMT+0530 (IST)

విభిన్న పాత్రలు.. డిఫరెంట్ కంటెంట్ ఉండే చిత్రాలు ఎంచుకుంటూ తన కెరీర్లో ముందుకు సాగిపోతున్న రానా దగ్గుబాటి '1945' టైటిల్ తో తెరకెక్కుతున్న ఒక పీరియడ్ డ్రామాలో  నటిస్తున్నాడు.  సినిమా టైటిల్ కు తగ్గట్టే ఈ కథ బ్రిటీష్ వారి జమానాలో సాగుతుందట. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా యాభై శాతం పైగా పూర్తయినా మధ్యలో ఆగింది. మళ్ళీ ఈ సినిమా పట్టాలెక్కిందట.ఈ సినిమా కోసం గడ్డం లేకుండా ఒక డిఫరెంట్ హెయిర్ స్టైల్ లో కనిపించిన రానా ఇప్పుడు గెటప్ పూర్తిగా మార్చేశాడు హెయిర్ స్టైల్ నార్మల్ గానే ఉన్నా పొడవాటి గడ్డంతో రగ్డ్ అవతారంలోకి మారిపోయాడు. అంటే ఈ సినిమాలో రానాకు రెండు గెటప్ లు ఉన్నట్టే.  ప్రస్తుతం  ఈ సినిమాకు సంబంధించిన ఒక యాక్షన్ సీక్వెన్స్ ను తెరక్కిస్తున్నారట. పాత కాలం నాటి పెంకుటిల్లు పక్కన ఉన్న పొడవైన టవర్ ఎక్కి ఏదో చేస్తున్నాడు రానా.  యాక్షన్ స్టంట్ కాబట్టి సేఫ్టీ మెజర్ గా ఒక రోప్ కూడా కట్టి ఉంది. ఈ గెటప్ లో ఉన్న రానాను చూపించి ఎవరో గుర్తు పట్టమంటే ఎవరికైనా కష్టమే.

ఈ తమిళ - తెలుగు ద్విభాషా చిత్రానికి సత్యశివ దర్శకుడు.   సత్యరాజ్.. నాజర్ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో రెజీనా హీరోయిన్. ఇప్పటికే కొచ్చి లో ఒక షెడ్యూల్.. శ్రీలంక లో మరో కీలకమైన షెడ్యూల్ కూడా పూర్తి చేసిన ఈ సినిమా పెండింగ్ షూట్ వీలైనంత త్వరగా పూర్తి చేసే ప్రయత్నాల్లో ఉన్నారట ఫిలిం మేకర్స్.