పుణ్యక్షేత్రాల చుట్టూ తిరుగుతున్న రానా

Tue Jan 10 2017 14:32:46 GMT+0530 (IST)

దగ్గుబాటి రానా ఇప్పుడు తెగ బిజీగా ఉన్నాడు. బాహుబలి 2 మూవీకి గాను తన భాగం షూటింగ్ ని గతంలోనే పూర్తి చేసేసిన రానా.. కొత్త ప్రాజెక్టులను కూడా చకచకా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే ఇండియాలో తొలిసారిగా సబ్ మెరైన్ థీమ్ తో వస్తున్న ఘాజీ చిత్రానికి ఫస్ట్ లుక్ తో పాటు.. పోస్టర్ ను కూడా లాంఛ్ చేసిన రానా.. మరోవైపు తేజ దర్శకత్వంలో కూడా మూవీని చకచకా ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు.ఈ మూవీ కోసం ఇప్పటికే తమిళనాడులో ఓ షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న తర్వాత.. అనంతపురం జిల్లాలో కీలక సన్నివేశాలు చిత్రీకరించిన సంగతి తెలిసిందే. జనాల మధ్యలో పొలిటికల్ లీడర్ గా రానా నడుచుకుంటూ వస్తున్న పిక్స్ ఇప్పటికే ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పుడు కర్నూలు జిల్లాలో పుణ్యక్షేత్రాల్లో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణలో ఉన్నారు రానా-తేజ టీం. బనగానపల్లి.. యాగంటి.. మహానంది ప్రాంతాల్లో కీలక సన్నివేశాల షూటింగ్ జరుగుతోంది.

మహానందిలో రానా అండ్ టీం షూటింగ్ చేసిన పిక్స్ ఇప్పుడు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ మూవీలో రానాకి జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే.