Begin typing your search above and press return to search.

నేనే రాజు నేనే మంత్రి.. విడుదల ఆగింది

By:  Tupaki Desk   |   11 Aug 2017 4:46 AM GMT
నేనే రాజు నేనే మంత్రి.. విడుదల ఆగింది
X
దగ్గుబాటి రానా కొత్త సినిమా ‘నేనే రాజు నేనే మంత్రి’ విడుదల ఆగిపోయింది. ఐతే ఆ సినిమాకు బ్రేక్ పడింది తెలుగులో కాదు. తమిళంలో. ఎంతో ఆలోచించి.. ఆచితూచి వ్యవహరించి.. ఆగస్టు 11న తెలుగుతో పాటే తమిళంలోనూ ఈ సినిమాను రిలీజ్ చేయాలని చూస్తే.. అనివార్య కారణాల వల్ల అక్కడ విడుదలకు నోచుకోలేదు. ధనుష్ సినిమా ‘వీఐపీ-2’ అక్కడ ఈ రోజు భారీ స్థాయిలో విడుదలవుతున్న నేపథ్యంలో చాలినన్ని థియేటర్లు దొరక్కపోవడం వల్లే విడుదల ఆగినట్లుగా చెబుతున్నారు.

ఈ శుక్రవారం ‘నేనే రాజు నేనే మంత్రి’తో పాటు తెలుగులో ఇంకో రెండు క్రేజున్న సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ డేటుకు ముందుగా బెర్తులు బుక్ చేసుకున్నది ఆ రెండు సినిమాలే. కానీ ‘నేనే రాజు నేనే మంత్రి’ లేటుగా రేసులోకి వచ్చింది. దీనిపై ఆ రెండు చిత్రాల నిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేశారు కూడా. కానీ తమిళ భారీ చిత్రం ‘వివేగం’ యధావిధిగా ఆగస్టు 10న వస్తే తాము 24కు ఫిక్సయ్యేవాళ్లమని.. కానీ ఆ చిత్రం 24కు వాయిదా పడటంతో తమది తమిళంలోనూ విడుదల కావాల్సిన సినిమా కాబట్టి ఆగస్టు 11కే రిలీజ్ చేయక తప్పట్లేదని అన్నారు సురేష్ బాబు. కానీ ఇప్పుడు తమిళ వెర్షన్ విడుదలే ఆగిపోయింది. ఇది ‘లై’.. ‘జయ జానకి నాయక’ నిర్మాతలకు మంట పుట్టించే వ్యవహారమే. ‘నేనే రాజు నేనే మంత్రి’ లేటుగా రేసులోకి రావడం వల్ల మిగతా రెండు సినిమాలకు ఆశించిన స్థాయిలో థియేటర్లు దక్కలేదు. మరి ఈ చిత్ర తమిళ వెర్షన్ ఎప్పుడు విడుదలవుతుందో చూడాలి.