Begin typing your search above and press return to search.

స్నేహితురాలిని క‌ల‌వ‌డానికే వెళ్లాడా!

By:  Tupaki Desk   |   25 Jun 2019 4:25 AM GMT
స్నేహితురాలిని క‌ల‌వ‌డానికే వెళ్లాడా!
X
యంగ్ బ్యాచిల‌ర్ హీరో రానా స్నేహాల గురించి తెలిసిందే. క‌థానాయిక‌తో స్నేహం చేయ‌డంలోనూ రానా స్పీడ్ గానే ఉంటాడు. ఇంత‌కీ పెళ్లెప్పుడు? అంటే స‌మాధానం ఉండ‌దు కానీ.. స్నేహంలో మాత్రం భ‌ళ్లాలుడు జరంత స్పీడ్ గానే ఉంటాడు. బాలీవుడ్ లో ప్ర‌వేశించాక బిపాస బ‌సుతో.. సౌత్ లో త్రిష‌తో ఎంతో స‌న్నిహితంగా మెలిగాడు. త్రిష‌తో ల‌వ్ బ్రేక‌ప్ అయ్యిందా? అని మీడియా ప్ర‌శ్నించిన ప్ర‌తిసారీ త‌న‌తో స్నేహం మాత్రమే చేశాన‌ని రానా వెల్ల‌డించారు. కాఫీ విత్ క‌ర‌ణ్ షోలోనూ ఇటీవ‌ల రానా అదే విష‌యాన్ని రివీల్ చేశారు. త్రిష మంచి ఫ్రెండు మ‌త్ర‌మేన‌ని తెలిపాడు.

అదంతా అటుంచితే రానాకి అందాల క‌థానాయిక శ్రుతిహాస‌న్ బెస్ట్ ఫ్రెండ్ అన్న సంగ‌తి తెలిసిందే. ఈ ఇద్ద‌రికీ ఇండ‌స్ట్రీలో చాలా కాలంగా క్లోజ్ నెస్ ఉంది. అందుకేనేమో.. చెన్న‌య్ వెళ్లిన రానా అక్క‌డ ప్ర‌త్యేకించి శ్రుతి హాస‌న్ ని క‌లిసేందుకు వెళ్లాడ‌ట‌. ఆ ఇద్ద‌రూ క‌లిసి సెల్ఫీ దిగిన హ్యాపీ మూవ్ మెంట్ ని రానా స్వ‌యంగా అభిమానుల కోసం సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేశారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోల్ని ఫ్యాన్స్ జోరుగా వైర‌ల్ చేస్తున్నారు.

ఇక కెరీర్ పరంగా చూస్తే ఆ ఇద్ద‌రూ బిజీ బిజీ. రానా ఒకేసారి మూడు నాలుగు సినిమాల్లో న‌టిస్తూ క్ష‌ణం తీరిక లేనంత బిజీగా ఉన్నాడు. మ‌రోవైపు శ్రుతిహాస‌న్ విజ‌య్ సేతుప‌తి సినిమాతో పాటు బాలీవుడ్ టాలీవుడ్ లోనూ సినిమాలు చేసేందుకు రెడీ అవుతోంది. ఈలోగానే ప్ర‌ఖ్యాత ఏబీసీ నెట్ వ‌ర్క్ నిర్మిస్తున్న ట్రెడ్ స్టోన్ అనే అమెరికా వెబ్ సిరీస్ లోనూ న‌టించేందుకు సంత‌కం చేసింది. ఇందులో శ్రుతి ద్విపాత్రాభిన‌యం చేయ‌నుంది. నీరా ప‌టేల్ అనే యువ‌తిగా.. అలానే సీక్రెట్ గా ఎదురుదాడులు చేసే విప్ల‌వ‌భావాలున్న ఫైట‌ర్ గా శ్రుతి క‌నిపించ‌నుంది. బోయ్ ఫ్రెండ్ మైఖేల్ కోర్స‌లే నుంచి విడిపోయాక శ్రుతి సింగిల్ స్టాట‌స్ ని కొన‌సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే.