Begin typing your search above and press return to search.

​రానా కాజల్.. కాఫి కబుర్లు

By:  Tupaki Desk   |   27 Jun 2017 7:49 AM GMT
​రానా కాజల్.. కాఫి కబుర్లు
X
ఒక హీరో ఒక హీరోయిన్ ఒక సినిమా కన్నా ఎక్కువ చేస్తే వాళ్ళ మధ్య ఏదో ఉండే ఉంటుంది అని మనవాళ్లు అనుకుంటారు. సినిమా పూర్తి అయ్యాక కూడా వాళ్ళు కలిసి తిరిగితే ఇంకా వాళ్ళు ప్రేమ పక్షులు అని ముద్ర కూడా వేస్తారు. సినిమాలో ఒక జంట హిట్ అయితే ఆ ఇద్దరు గురించి మరింత దృష్టి పెడుతుంది అభిమాని ప్రేక్షక సమాజం. మన తెలుగులో ఇలాంటి ప్రేమ కలాపాలు తక్కువనే చెప్పాలి. అయితే ఈ మధ్య ఫిల్మ్ నగర్లో ఒక కొత్త పుకారు తిరుగుతుంది.

డైరెక్టర్ తేజ డైరక్షన్లో రాబోతున్న తాజా చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలో రానా - కాజల్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ కూడా ఆసక్తికరంగానే ఉంది. ఈ సినిమాలో కాజల్ అండ్ రానా మధ్య కెమిస్త్రీ సినీ అభిమానులుకు బాగా నచ్చింది. అందుకే షూటింగ్ జరుగుతున్నప్పుడు వీళ్ళ మధ్య స్నేహం కాస్త ముదిరింది అని ఒక టాక్ వస్తోంది. షూటింగ్ తరవాత కూడా కాఫిలు తాగుతూ ముచ్చటలు పెట్టుకుంటున్నారట. కాకపోతే ఇప్పుడు అందరి ఆలోచన ఏంటిoటే రానా-కాజల్ మధ్య స్నేహం వలన ఈ సన్నిహితం ఏర్పడిందా లేకపోతే నిజంగానే వీళ్ళు డేటింగ్ మొదలుపెట్టారా అనేదే తెలియట్లేదు.

తేజ డైరక్షన్ లో సురేశ్ బాబు నిర్మాతగా నేనే రాజు నేనే మంత్రి సినిమా త్వరలో విడుదలకాబోతుంది. ఈ సినిమాలో రానా - కాజల్ - కాథెరిన్ నటిస్తున్నారు. అనూప్ రుబెన్స్ ఈ సినిమాకు మ్యూజిక్ ఇస్తున్నాడు. ట్రైలర్ విడుదల కానీ ఆ సినిమా పాత్రలు పరిచయం కానీ కొత్తగా ప్లాన్ చేశారు. సినిమా కూడా అంతే కొత్తగా ఉంటుంది అని అందరూ అనుకుంటున్నారు. లెటజ్ సీ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/