Begin typing your search above and press return to search.

జ‌న‌వ‌రిలో `హిర‌ణ్య` సెట్స్‌కి

By:  Tupaki Desk   |   12 Dec 2018 9:30 AM GMT
జ‌న‌వ‌రిలో `హిర‌ణ్య` సెట్స్‌కి
X
టాలీవుడ్ 85 ఏళ్ల‌ హిస్ట‌రీ లో మ‌రో సంచ‌ల‌నానికి తెర లేచింది. ఇంత‌కాలం విజువ‌ల్ గ్రాఫిక్స్‌కి సంబంధించిన వ‌ర‌కూ బాహుబ‌లి- ఈగ‌- 2.0 తోపు అంటూ మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ తోపును కొట్టే తురుము రెడీ అవుతోంది. తాడిని త‌న్నేవాడొక‌డొస్తే వాడి త‌ల‌ద‌న్నేవాడొక‌డొస్తాడంటారు. ఆడే రానా!

ఇంత‌కీ రానా అంత‌గా ఏం చేయ‌బోతున్నాడు? అంటారా.. భ‌ళ్లాలుడిగా కొడ్తే కుంభాన్ని కొట్టాలి అన్న చందంగా చెల‌రేగిపోయిన ద‌గ్గుబాటి హీరో మునుముందు భారీ ప్ర‌యోగాల‌కు శ్రీ‌కారం చుడుతున్నాడు. ఇండ‌స్ట్రీ ప్రొఫెస‌ర్.. డీన్ ద‌గ్గుబాటి సురేష్ బాబు బ్యాక్‌ బోన్‌గా రానా ప్ర‌తి అడుగును కొత్త‌గా వేయ‌బోతున్నాడు. మెగా మెరుపుల్ని సైతం పక్క‌కు నెట్టే తురుము లాంటి ప్లాన్ ఇది. మునుముందు రానా న‌టించేవి అన్నీ యూనివ‌ర్శ‌ల్ కాన్సెప్టు ఉన్న భారీ విజువ‌ల్ గ్రాఫిక్స్ సినిమాలే. అవ‌న్నీ ఒక‌టొక‌టిగా అత‌డి క‌ల‌ల్లో, క‌ళ్ల‌లోనూ పురుడుపోసుకుంటున్నాయి. అది అత‌డి డ్రీమ్. దానిని ఢీకొట్ట‌డం.. కొండైనా పిండి చేయ‌డం అన్న‌దొక్క‌టే త‌న‌కు తెలిసిన విద్య‌.

అందులో తొలి అడుగు `హిరణ్య‌`. హిర‌ణ్య‌క‌సిపుని పురాణేతిహాసానికి సంబంధించిన క‌థాంశంతో తెర‌కెక్క‌నుంది. హిర‌ణ్య క‌సిప అన‌గానే.. పురాణాల్లో హిర‌ణ్య‌క‌సిపుడు అనే రాక్ష‌సుడిని శ్రీ‌న‌ర‌సింహ‌స్వామి కోపోద్రిక్తుడై పొట్ట చీల్చే స‌న్నివేశం మ‌న‌కు గుర్తుకొస్తుంది. దానిని వీఎఫ్ఎక్స్ మాయాజాలంలో చూసే వీలుంది ముందు. ఇప్ప‌టికే ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన ప‌ని చాలా సీరియ‌స్‌గా సాగుతోంది. అది అటు అమెరికా, ఇటు ఇండియాలో ప‌లు చోట్ల‌, హైద‌రాబాద్‌లో ఎంతో సీరియ‌స్‌గా స్క్రిప్టు వ‌ర్క్- టెక్నిక‌ల్ వ‌ర్క్‌ న‌డుస్తోంద‌ని నిర్మాత‌ సురేష్‌బాబు ఇదివ‌ర‌కూ ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు.

ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించిన కీల‌క స‌మాచారం అందింది. కొత్త సంవ‌త్స‌రంలో రానా అభిమానుల చెవిలో అమృతం పోసే వార్త ఇది. జ‌న‌వ‌రిలోనే ఈ భారీ ప్రాజెక్టును అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ప్రారంభించ‌నున్నార‌ని తెలుస్తోంది. ఆ మేర‌కు ఈ సినిమాకి సెట్స్ వేస్తున్న ది గ్రేట్ రామ‌కృష్ణ వివ‌రాలు అందించారు. హిర‌ణ్య క‌సిప మరో భారీ బ‌డ్జెట్ సినిమా. బాహుబ‌లి కాన్వాసుతో తెర‌కెక్కి దేశ‌- విదేశాల్లో చాలా భాష‌ల్లో రిలీజ్ కానుంద‌న్న స‌మాచారం అందింది. ద‌టీజ్ తురుము రానా స్కెచ్‌!!