Begin typing your search above and press return to search.

భళ్లాలదేవుడు బ్రహ్మాండంగా ఉన్నాడు

By:  Tupaki Desk   |   19 Jun 2018 4:39 AM GMT
భళ్లాలదేవుడు బ్రహ్మాండంగా ఉన్నాడు
X
ఇండస్ట్రీకి సంబంధించిన ఏ విషయమైనా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. ఒకోసారి అందులో అసలు విషయం కన్నా అబద్ధాలే ఎక్కువుంటాయి. దాంతో అభిమానులు కంగారు పడిపోయి తమ హీరో ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కోవడానికి నానా తంటాలు పడతారు. రీసెంట్ గా భళ్లాలదేవుడు రానా విషయంలో ఇదే జరిగింది.

రానా కంటికి సంబంధించి ఓ సర్జరీ చేయించుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఈలోగా రానా ఆరోగ్యం అస్సలు బాగాలేదు అనే దగ్గర మొదలై ఏకంగా కిడ్నీ మార్చాలనే దాకా రూమర్స్ వచ్చేశాయి. రానాను ఇదే విషయమై సంప్రదిస్తే వాటిల్లో ఎంతమాత్రమూ నిజంలేదని కొట్టి పారేశాడు. తాను ఎప్పటిలాగే ఫిట్ అండ్ ఫైన్ గా ఉన్నానని చెబుతున్నాడు. ‘‘నా కంటి సర్జరీ అనుకున్న దానికన్నా కాస్త డిలే అయింది. బ్లడ్ ప్రజర్ ఇష్యూల కారణంగా ఆలస్యమైంది. అంతకు మించి ఏమీ లేదు. నేను కమిట్ అయిన సినిమా షూటింగులన్నీ యథావిధిగా జరుగుతాయి. ఇప్పటికీ ముంబయి - హైదరాబాద్ మధ్య బిజీగా తిరుగుతూనే ఉన్నా’’ అంటూ రానా క్లారిటీ ఇచ్చాడు.

రానా ప్రస్తుతం మూడు భాషల్లో హాథీ మేరా సాథీ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ షెడ్యూల్ పూర్తయింది. తరవాత షెడ్యూల్ మాత్రం కాస్త పోస్ట్ పోన్ చేశారు. ఇది కూడా రానా ఆపరేషన్ కోసం కాదని ఆయన తండ్రి సురేష్ బాబు చెప్పుకొచ్చారు. హాథీ మేరా సాథీ తరవాత షెడ్యూల్ కేరళలో ఉందని.. అక్కడ వర్షాల కారణంగా రెండు నెలలు ఆగాల్సి వస్తోందన్నారు. రానా కంటి ఆపరేషన్ ఈ నెలాఖరులో కానీ.. వచ్చేనెల మొదట్లో కానీ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.