Begin typing your search above and press return to search.

ఘాజీ బాక్సాఫీస్ పై ఎలా అటాక్ చేసింది?

By:  Tupaki Desk   |   21 Feb 2017 5:05 AM GMT
ఘాజీ బాక్సాఫీస్ పై ఎలా అటాక్ చేసింది?
X
విడుదలకు ముందు ప్రివ్యూలతోనే ఫుల్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది ‘ఘాజీ’. రిలీజ్ తర్వాత రివ్యూలు.. పబ్లిక్ టాక్ కూడా ఫుల్ పాజిటివే. దీంతో క్లాస్ సినిమానే అయినా వసూళ్లకు ఢోకా ఏమీ లేదు. అన్ని బాషల్లోనూ ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్సే వచ్చాయి. తెలుగు.. హిందీ.. తమిళంలో కలిపి తొలి వారాంతం ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.23 కోట్ల గ్రాస్.. రూ.12 కోట్ల దాకా షేర్ రాబట్టింది.

పాటలు.. కమర్షియల్ అంశాలు ఏమీ లేకుండా ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఇలాంటి సినిమాకు ఈ వసూళ్లు రావడం గొప్ప విషయమే. ఈ చిత్రానికి మేజర్ షేర్ తెలుగు రాష్ట్రాల నుంచే రావడం విశేషం. ఏపీ.. తెలంగాణలో కలిపి తొలి వారాంతంలో ‘ఘాజీ’ రూ.4 కోట్ల షేర్.. రూ.6.6 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. తమిళనాడులో కోటి దాకా వీకెండ్ షేర్ వచ్చింది. ఇండియాలో మిగతా ప్రాంతాలన్నీ కలిపి రూ.5.5 కోట్ల షేర్ వసూలైంది.

అమెరికాలో ‘ఘాజీ’కి ప్రిమియర్స్ నుంచి ఆశించిన స్పందన రాలేదు. కానీ తర్వాత ఈ చిత్రం బాగా పుంజుకుంది. వారాంతం అయ్యేసరికి 4 లక్షల డాలర్లకు పైగా వసూలు చేసి.. హాఫ్ మిలియన్ దిశగా సినిమా దూసుకెళ్తోంది. వీకెండ్ తర్వాత కూడా సినిమా అన్ని చోట్లా స్టడీగా ఉంది. ఈ ఊపు చూస్తుంటే ‘ఘాజీ’ అన్ని భాషల్లో కలిపి ఫుల్ రన్లో రూ.50 కోట్ల షేర్ మార్కును చేరుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమా రూ.40 కోట్ల షేర్ వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ కు వస్తుందని అంచనా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/