Begin typing your search above and press return to search.

ఆ ఒక్క డైలాగ్ భలే పేలింది!!

By:  Tupaki Desk   |   11 Aug 2017 1:22 PM GMT
ఆ ఒక్క డైలాగ్ భలే పేలింది!!
X
ఈరోజు విడుదలైన అన్ని సినిమాల్లోనూ ఏదో ఒక పంచ్ డైలాగులూ పంచ్ లు లాగా అనిపించకపోయినా కూడా అనిపించేశాయి. నేనే రాజు నేనే మంత్రిలో సామెతలు.. లై సినిమాలో ఎనాలజీలు.. జయ జానకి నాయక లో ప్రేమ పంచులు.. చాలానే ఉన్నాయి. వీటన్నింటిలోకి తేజ తీసిన పొలిటికల్ డ్రామాలో మాత్రం ఒక లైన్ భలే అదిరిపోయింది. ఆ డైలాగుతో ఒకేసారి చాలామంది కనక్ట్ అవుతారు.

''సినిమాల్లో నటించే ఒక మహానుభావుడు పార్టీ పెడితే అక్కడా మేమే. ఒక మాస్ హీరో పార్టీ పెడితే అక్కడా మేమే. విప్లవ భావజాలం ఉన్నాయన పార్టీ పెట్టినా అక్కడా మేమే. ఇంకెవరన్నా రేపు కొత్తగా పార్టీ పెట్టినా అక్కడా మేమే. ఏ పార్టి గెలిచినా ఏ కొత్త నేత వచ్చి పార్టీ పెట్టినా.. మేం మాత్రం ఎప్పుడూ అధికారంలో ఉంటాం'' అంటూ ఒక డైలాగ్ పేలుస్తాడు 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలో ఒక రాజకీయ నాయకుడు పాత్రను పోషిస్తున్న అశుతోష్‌ రానా. ఈ డైలాగులోని డెప్త్ గురించి పెద్దగా థింక్ చేయక్కర్లేదు. అప్పట్లో వివిధ పార్టీల్లో ఉండి పదవులు పొందలేని వారు.. ఎన్టీఆర్ పార్టీ పెట్టగానే అక్కడకు దూకేసి మినిస్టర్లు అయ్యారు. అలాగే చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు అక్కడకూ దూకేసి విలీనం తరువాత కొందరు పదవులు పొందారు. రేపు ఏదన్నా కొత్త పార్టీ గెలిచినా అంటే.. ఆ పార్టీలేవో మీకు తెలుసులే.. అక్కడ వీరు గెలిచినా గెలిచి మినిస్టర్లు అవుతారు. ఇదే విషయం జనరలైజ్ చేసి డ్రమటిక్ గా చెప్పించాడు తేజ.

అన్ని మాస్ సెంటర్లలోనే కాదు.. క్లాస్ సెంటర్లలో కూడా ఈ డైలాగుకు మాత్రం జనాలు గట్టిగా వీలలు చప్పట్లూ కొట్టేస్తున్నారు. అయితే ఈ డైలాగ్ ఎంత బాగుందని చెప్పినప్పటికీ.. ఇంటికెళ్ళాక ఎన్నికలొస్తే మళ్లీ అదే తరహా జంపింగ్ జపాంగ్ లకే జనాలు ఓట్లేస్తున్నారు. కాదంటారా?