Begin typing your search above and press return to search.

ఏంటిది రాణా.. అన్నీ ఆ సినిమాలేనా?

By:  Tupaki Desk   |   1 May 2016 11:30 AM GMT
ఏంటిది రాణా.. అన్నీ ఆ సినిమాలేనా?
X
బాహుబలి తర్వాత దగ్గుబాటి రాణా రేంజ్ మారిపోయింది. అంతకు ముందే బాలీవుడ్ సినిమాల్లో కూడా కనిపించినా.. బాహుబలిలో విలన్ రోల్ చేసిన తర్వాత భారీ ఆఫర్స్ తో పాటు విభిన్నమైన పాత్రలు కూడా రాణా తలుపు తడుతున్నాయి. ఇప్పుడు బాహుబలి ది కంక్లూజన్ లో నటిస్తున్న రాణా.. మరికొన్ని సినిమాలను కూడా శరవేగంగా పూర్తి చేసేస్తున్నాడు.

ప్రస్తుతం ఘాజీ అనే ఓ హిస్టరీ బేస్డ్ కాన్సెప్ట్ మూవీని చేస్తున్నాడు రాణా. ఇండో పాక్ వార్ లో భాగంగా మునిగిపోయిన ఓ సబ్మెరైన్ ను థీమ్ గా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇది కాకుండా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఎనై నొక్కి పాయుమ్ తొట్ట అనే థ్రిల్లర్ కి సైన్ చేసిన బాహుబలి విలన్.. ఇప్పుడు మరో చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కజుగూ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన సత్యశివ డైరెక్షన్ లో.. ఓ పీరియాడిక్ మూవీ ఒప్పుకున్నాడట రాణా.

రాణా లీడ్ రోల్ లో నటించే ఈ మూవీ షూటింగ్ జూన్ నుంచి స్టార్ట్ కానుంది. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఇస్తుండగా.. హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నారు. అయితే.. ఇది కూడా పీరియాడిక్ మూవీ కావడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇప్పటికే బాహుబలి2లో ఇలాంటి రోల్ లో చూడాల్సి ఉండగా.. ఘాజీలోనూ ఓల్డేజ్ గెటప్, స్టోరీలోనే కనిపించనున్నాడు. ఇప్పుడు మరోసారి ఇలాంటి సినిమాకే సైన్ చేయడం అంటే.. రాణా రిస్క్ చేస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది.