Begin typing your search above and press return to search.

త‌మిళ్ 'జెర్సీ' కి యంగ్ హీరో బూస్ట్

By:  Tupaki Desk   |   18 July 2019 5:53 AM GMT
త‌మిళ్ జెర్సీ కి యంగ్ హీరో బూస్ట్
X
నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన `జెర్సీ` క్రిటిక్స్ ప్ర‌శంస‌లు ద‌క్కించుకున్న సంగ‌తి తెలిసిందే. మ‌ధ్య త‌ర‌గ‌తి యువ‌కుడి క్రికెట్ డ్రీమ్స్ నేప‌థ్యంలో ఎమోష‌న‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ ఇది. మిడిల్ క్లాస్ క‌ల‌లు.. ఆర్థిక క‌ష్టాల నేప‌థ్యాన్ని క్రికెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించ‌డం తెలుగు ప్రేక్ష‌కుల‌కు కొత్త ఫీల్ ని క‌లిగించింది. యంగ్ ట్యాలెంటెడ్ గౌత‌మ్ తిన్న‌నూరి ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు. తొలి ప్ర‌య‌త్న‌మే ఇలాంటి ఛాలెంజింగ్ మూవీని తెర‌కెక్కించిన గౌత‌మ్ కి చ‌క్క‌ని పేరొచ్చింది. సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప‌తాకంపై నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ సినిమాని ఇరుగు పొరుగు భాష‌ల్లో రీమేక్ చేసేందుకు సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప‌లువురు అగ్ర నిర్మాత‌ల‌తో టై అప్ పెట్టుకుంటున్న సంగ‌తి తెలిసిందే.

హిందీలో ఈ సినిమాని గీతా ఆర్ట్స్ అధినేత‌ అల్లు అర‌వింద్ తో క‌లిసి రీమేక్ చేసేందుకు సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ స‌న్నాహాలు చేస్తోంది. తాజాగా త‌మిళ వెర్ష‌న్ కి వేరొక యంగ్ హీరో కం ప్రొడ్యూస‌ర్ సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ తో చేతులు క‌లిపార‌ని తెలుస్తోంది. ఆయ‌న మ‌రెవ‌రో కాదు ట్యాలెంటెడ్ రానా. 2018లో `కేరాఫ్ కంచ‌ర పాలెం` లాంటి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాకి స‌మ‌ర్ప‌కుడిగా ప్ర‌చార సాయం అందించిన రానా ఈ ఏడాది ప‌లు కంటెంట్ బేస్డ్ సినిమాల‌కు త‌న‌వంతు స‌పోర్ట్ అందిస్తున్నారు. అలాగే సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌- శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్ జంట‌గా క్ష‌ణం ఫేం ర‌వికాంత్.పి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాని నిర్మిస్తున్నారు. వీటితో పాటే తెలుగు క్లాసిక్ `జెర్సీ`ని త‌మిళంలో నిర్మించేందుకు రానా ఓకే చెప్పార‌ట‌.

హీరో విష్ణు విశాల్ `జెర్సీ` త‌మిళ‌ రీమేక్ లో న‌టించ‌నున్నార‌ని తెలుస్తోంది. ఇక‌పోతే రానా ఇప్ప‌టికే `హాథీ మేరా సాథీ`.. `హిర‌ణ్య క‌సిప` లాంటి భారీ చిత్రాల్లో న‌టిస్తున్నారు. కిలాడీ అక్ష‌య్ కుమార్ తో క‌లిసి రానా న‌టించిన `హౌస్ ఫుల్ 4` త్వ‌ర‌లోనే రిలీజ్ కి రెడీ అవుతోంది.