Begin typing your search above and press return to search.

రోల్ కోసం రియల్ ఆఫీసర్ తో రానా

By:  Tupaki Desk   |   23 May 2017 6:43 AM GMT
రోల్ కోసం రియల్ ఆఫీసర్ తో రానా
X
దగ్గుబాటి రానా కెరీర్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉంది. బాహుబలి సిరీస్ లో భల్లాల దేవుడిగా విలన్ పాత్రలో నటించినా.. రానాకు సూపర్ హీరో ఇమేజ్ వచ్చేసింది. తెలుగుతోపాటు.. తమిళ్.. హిందీ భాషల్లో కూడా అలరించేస్తున్నాడు రానా. ఇప్పటికే ఈ హీరో చేతిలో పలు ప్రాజెక్టులు ఉండగా.. ఇప్పుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యను బేస్ చేసుకుని తీస్తున్న సినిమాలో నటించనున్నాడు.

అస్ఫోటా- ది హ్యమన్ బాంబ్ అనే టైటిట్ పై రూపొందనున్న మూవీలో.. రానా ఓ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నాడు. రాజీవ్ గాంధీ హత్యానంతరం ఆ కేసును పరిశోధించారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చీఫ్ డి.ఆర్. కార్తికేయన్. అప్పట్లో ఈ కేసును ఆయన ఛేదించిన తీరు దేశం మొత్తాన్ని ఆకట్టుకుంది. ఇప్పుడు అదే పాత్రలో కనిపించనున్నాడు రానా దగ్గుబాటి. రీల్ లైఫ్ లో తాను చేయనున్న పాత్ర కోసం.. రియల్ లైఫ్ లో కార్తికేయన్ ను కలిశాడు రానా. రీసెంట్ గా హైద్రాబాద్ లోని ఓ రెస్టారెంట్ కలుసుకున్న వీరిద్దరూ.. కొన్ని గంటలపాటు మాట్లాడుకున్నారు.

రాజీవ్ గాంధీ అస్సాసినేషన్:ది ఇన్వెస్టిగేషన్ అనే టైటిల్ పై తాను రాసిన పుస్తకాన్ని రానాకి అందించారు కార్తికేయన్. ఈ పాత్రను చేసేందుకు తనకు ఈ బుక్ ఎంతో హెల్ప్ అవుతుందని రానా అంటున్నాడు. తెలుగు హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ మూవీని ఏఏంఆర్ రమేష్ దర్శకత్వంతో పాటు నిర్మాణంలో కూడా పాలు పంచుకోనున్నాడు. ఈ మూవీకి రానాకి బాబాయ్ అయిన విక్టరీ వెంకటేష్ నిర్మాత కావడం విశేషం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.