Begin typing your search above and press return to search.

ఇండియా డే.. అందుకేనా రానా??

By:  Tupaki Desk   |   20 Aug 2017 9:19 AM GMT
ఇండియా డే.. అందుకేనా రానా??
X
ఆగస్టు 15న మనం స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటే.. ఆ వెంటనే వచ్చే సండే ఒకటి చూసుకుని అమెరికాలో కూడా మనోళ్లు ఇండియన్ ఇండిపెండెన్స్ ను సెలబ్రేట్ చేసుకుంటారు. దానినే ''ఇండియా డే పెరేడ్'' అంటారు. ఈరోజు అమెరికాలోని న్యూయార్క్ లో ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ వద్ద ఈ పెరేడ్ జరగనుంది. సడన్ గా మన టాలీవుడ్ నుండి అక్కడ ఎవరు తేలారో తెలుసా?

నిజానికి దేశభక్తితోనే రానా దగ్గుబాటి ఇప్పుడు అమెరికా వెళ్ళి అక్కడ న్యూయార్క్ లో ఇలా ఇండియా డే పెరేడ్ లో పాల్గొంటున్నాడని అనుకుందాం. అయితే ఇదంతా చూసినోళ్ళకు ఎంత నమ్యశక్యంగా ఉంటుంది? ఇప్పుడు తన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాను ముప్పేట పోటీలో రిలీజ్ చేసి బీభత్సంగా ప్రమోట్ చేసుకున్నాడు రానా. దాని వలన సినిమాకు గట్టి ఓపెనింగులే వచ్చాయి. అందుకే సినిమాను ఇంకా ప్రమోట్ చేయడానికి.. సినిమాలో తాము దేశభక్తిని చూపించాం కాబట్టి అందుకు చిహ్నంగా ఇప్పుడు ఇండియా డే పెరేడ్ కు వెళ్తున్నాడని నెట్టింట్లో కామెంట్లు వినిపిస్తున్నాయి.

అదంతా పట్టించుకోని రానా.. నేను ఇప్పుడు న్యూయార్క్ లో ఉన్నాను.. మీరందరూ రండి అక్కడ కలసి మనం దేశభక్తిని చాటుదాం అంటున్నాడు. అటు భక్తికి భక్తి ఇటు నేనే రాజు నేనే రాణి సినిమాకు ప్రమోషన్.. భలే కలిసొచ్చిందిలో మనోడికి!!