ఈ ఏడాదికి నాలుగవ రిలీజ్ కూడా..

Fri Oct 13 2017 11:45:08 GMT+0530 (IST)

ప్రస్తుత ఆడియెన్స్ మైండ్ సెట్ ను చూస్తుంటే రెగ్యులర్ కమర్షియల్ సినిమాల రోజులు పోయాయి అనిపిస్తోంది. ఒకవేళ అలాంటి సినిమాలు వచ్చినా ఎక్కువ రోజులు ఆడడం లేదు. ఈ మధ్య హీరోలు కొత్త తరహాలో ఉన్న కథలనే ఒకే చేస్తున్నారు. మొన్నటి వరకు ఒక ట్రాక్ లో ఉన్న బడా హీరోలు కూడా కొంచెం యూ టర్న్ తీసుకున్నారు. అయతే మొదటి నుంచి ప్రతి సినిమాకి ఎవరు ఉహించని విధంగా ఒక లాంగ్ యూ టర్న్ తీసుకుంటున్న హీరో రానా దగ్గుపాటి.ఎవరు చేయని పాత్రలను చేస్తూ.. డిఫరెంట్ సినిమాలను చేస్తున్నాడు. ఈ ఏడాది ఘాజి- బాహుబలి మరియు నేనే రాజు నేనే మంత్రి వంటి డిఫరెంట్ సినిమాలను తీసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అదే విధంగా పరభాషా అభిమానులను కూడా రానా బాగానే ఆకర్షిస్తున్నాడు. ఇప్పుడు మరొక సినిమాతో మళ్లీ రెడీ అవుతున్నాడు రానా. 1945 లోని బ్రిటిష్ ఇండియా కాలం నాటి ఘటనల ఆధారంగా తమిళ్ - తెలుగులో ఒక పిరియాడిక్ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాను కూడా రానా ఈ ఇయర్ ఎండింగ్ లో రిలీజ్ చేయడానికి సన్నహకలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంటే ఈ ఏడాదికి మనోడికి నాలుగవ రిలీజ్ అనమాట.

ఈ సినిమాకు తమిళ్ లో 'మదై తీరంతు' అనే టైటిల్ సెట్ చేయగా తెలుగులో '1945' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. రీసెంట్ గా మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ఈ రోజు స్టార్ట్ అవ్వనుందని రానా సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. అంతే కాకుండా బ్రిటిష్ ఇండియా కాలం నాటి మ్యాప్ ను కూడా రానా పోస్ట్ చేశాడు. సత్యశివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కె ప్రొడక్షన్ నిర్మిస్తోంది. ఇక రానా ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. రెజీనా - లీషా హీరోయిన్స్ గా నటిస్తుండగా నాజర్- సత్య్ రాజ్ ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ గా  యువన్ శంకర్ రాజా వర్క్ చేస్తున్నాడు.