రానా లుక్ వెనుక సీక్రెట్ ఇదేనా?

Thu Jul 12 2018 17:47:46 GMT+0530 (IST)

`బాహుబలి`లో భల్లాల దేవుడి క్యారెక్టర్ లో దగ్గుబాటి రానా ఒదిగిపోయిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో కండలవీరుడిగా కనిపించిన రాణా...ఆ తర్వాత కొద్దిగా బక్కచిక్కడంతో రకరకాల రూమర్లు వస్తున్న సంగతి తెలిసిందే. ఆరోగ్య సమస్యలతో రానా ఇబ్బంది పడుతున్నాడని పుకార్లు వస్తున్నాయి. సురేష్ బాబు - రానా పలుసార్లు వీటిని ఖండించినా అవి సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయి.  ఈ నేపథ్యంలోనే నిన్న జరిగిన` వెంకీమామ` లాంచ్ కు మీడియాను పిలవలేదని - ఆ కార్యక్రమంలో రానా పాల్గొనడమే అందుకు కారణమని వదంతులు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత సురేష్ బాబు విడుదల చేసిన ముహూర్తపు షాట్ లో మాత్రమే రానా కనిపించాడు.



అక్టోబర్ లో హైదరాబాద్ లో `సెన్సేషన్ రైజ్ ఈవెంట్` జరగనుంది. దీనికి సంబంధించి నిన్న జరిగిన `వైట్ థీమ్` ఈవెంట్ లో రానాతోపాటు గుత్తా జ్వాలా  కూడా పాల్గొన్నారు. ఆ సందర్భంగా రానా మీడియాతో మాట్లాడుతూ తన లుక్ పై షాకింగ్ న్యూస్ చెప్పాడు. ఇపుడు ఎందుకు సన్నగా కనిపిస్తున్నారని విలేకరి అడిగిన ప్రశ్నకు రానా ఆసక్తకర సమాధానమిచ్చాడు. కొత్త సినిమా ...కొత్త క్యారెక్టర్...దానిని బట్టి బాడీ పెంచాలని....ఒక సినిమా కోసం కండలు పెంచాలని...మరో సినిమా కోసం బరువు తగ్గాలని అన్నాడు. 10-15 రోజుల్లో తన కొత్త క్యారెక్టర్...లుక్ రివీల్ చేస్తానని ...గుబురు గడ్డం పెంచడం గురించి చెబుతానని అన్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ లో చంద్రబాబునాయుడి పాత్రను పోషించబోతున్నారా? అన్న ప్రశ్నకు రానా ఆసక్తికర సమాధానమిచ్చాడు. మీరు ఆ పాత్రలో నన్ను చూడాలనుకుంటున్నారా.... అయితే - చేస్తాను...అని పరోక్షంగా తాను ఆ పాత్రలో నటిస్తున్నట్లు చెప్పాడు. చంద్రబాబు పాత్రలో రానా నటించడం పై క్రిష్ అధికారికంగా ప్రకటించే వరకు ఈ సస్పెన్స్ కు తెరపడదు.