Begin typing your search above and press return to search.

రానా స్పీడు మామూలుగా లేదుగా!

By:  Tupaki Desk   |   16 Sep 2019 11:34 AM GMT
రానా స్పీడు మామూలుగా లేదుగా!
X
టాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉన్న హీరోలలో రానా దగ్గుబాటి ఒకరు. ఇప్పటికే రానా చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్న సంగతి తెలిసిందే. 'హాథీ మేరె సాథీ'.. '1945' లతో పాటుగా 'విరాటపర్వం' షూటింగ్ దశలో ఉన్నాయి. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'హిరణ్యకశ్యప' కు జోరుగా ప్రీ ప్రొడక్షన్ సాగుతోంది. ఇవన్నీ కాకుండా తాజా రానా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపాడని సమాచారం.

సిద్ధార్థ్ తో 'గృహం' చిత్రాన్ని రూపొందించిన మిలింద్ రావు రీసెంట్ గా ఒక కథతో రానాను మెప్పించడంతో వెంటంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. గృహం తరహాలోనే ఇది కూడా ఒక హారర్ ఫిలిం అని.. చేతబడి నేపథ్యంలో కథ ఉంటుందని సమాచారం. తెలుగు-తమిళ ద్విభాషా చిత్రంగా రూపొందే ఈ చిత్రాన్ని గోపీనాథ్ ఆచంట నిర్మిస్తారట. రానా ఈ సినిమా నవంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడని సమాచారం. అంతలోపే 'విరాటపర్వం' వర్క్ పూర్తి చేస్తాడట.

ప్రస్తుతం ఈ హారర్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ జోరుగా సాగుతోందట. దర్శకుడు నటీనటులను.. టెక్నిషియన్లను ఎంపిక చేసుకునే కసరత్తు చేస్తున్నాడట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని సమాచారం.