Begin typing your search above and press return to search.

బాహుబలి-2.. 2016లో కాదు

By:  Tupaki Desk   |   26 Nov 2015 11:30 AM GMT
బాహుబలి-2.. 2016లో కాదు
X
బాహుబలి.. ది బిగినింగ్ విడుదలై దాదాపు ఐదు నెలలవుతోంది. ఇప్పటిదాకా బాహుబలి-2 మొదలే కాలేదు. రెండు నెలలు గ్యాప్ తీసుకుని షూటింగ్ మొదలుపెట్టేస్తాం.. ఈ ఏడాది బాహుబలి-1 విడుదలైన సమయానికే వచ్చే ఏడాది బాహుబలి-2 వచ్చేస్తోంది అన్న జక్కన్న ఇంకా లొకేషన్లు చూసే పనిలోనే ఉన్నాడు. సినిమా ఎప్పుడు మొదలవుతుందో, ఎప్పుడు పూర్తవుతుందో జక్కన్నకు కూడా క్లారిటీ ఉన్నట్లు లేదు. బాహుబలి-1 కూడా ఎప్పటికో అనుకుంటే ఇంకెప్పటికో పూర్తయింది. పైగా బాహుబలి-2 కోసం దేశమంతా ఎదురు చూస్తోంది. అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.

అంతా చూస్తుంటే బాహుబలి-2 వచ్చే ఏడాది చివరికైనా విడుదలవుతుందా.. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుస్తుందా అని సందేహిస్తున్నారు జనాలు. యాంకర్ సుమకు కూడా ఇదే డౌటుతో నిన్న ‘భలే మంచి రోజు’ ఆడియో ఫంక్షన్ లో రానాను బాహుబలి-2 రిలీజ్ గురించి అడిగింది. అతనేమో ఈ ప్రశ్నకు వచ్చే ఏడాది కూడా బదులు దొరక్క పోవచ్చని తేల్చేశాడు. అంతకుమించి ఎక్కువ మాట్లాడలేదు కానీ.. వచ్చే ఏడాది బాహుబలి-2 రాకపోవచ్చన్న క్లారిటీ మాత్రం ఇచ్చేశాడు. ఇంతకీ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని సుమ అడిగితే.. ఆ ప్రశ్నకు జవాబు చెబితే రాజమౌళి తనను చంపేస్తాడని రానా చమత్కరించడం విశేషం.