Begin typing your search above and press return to search.

రానా తమ్ముడు కూడా రెడీ

By:  Tupaki Desk   |   21 Oct 2017 10:41 AM GMT
రానా తమ్ముడు కూడా రెడీ
X
సినిమా ఇండస్ట్రీలో ఒక్కరు అడుగుపెట్టినా చాలు ఆ తారలోకాలో విహరించాలని వారి ఫ్యూచర్ జనరేషన్ కూడా చాలా ఆశపడుతోంది. ప్రస్తుత రోజుల్లో ఒకే కుటుంబానికి చెందిన హీరోలు నటీనటులు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా నిర్మాతల సుపుత్రులు కూడా చాలామందే ఉన్నారు. టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత సురేష్ ప్రొడక్షన్స్ సృష్టి కర్త రామానాయుడు కుటుంబం కూడా ఇప్పుడు టాలీవుడ్ లో ముఖ్య పాత్ర పోషిస్తోంది.

మొదట వెంకటేష్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకొగా ఆ తర్వాత సురేష్ బాబు తనయుడు రానా లీడర్ తో ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమా అంతగా ఆడకపోయినా రానా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు అతని తమ్ముడు అభిరామ్ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. సురేష్ బాబు అందుకు కొత్త కథలను చాలా వింటున్నారట. ఈ మద్యే భాను శంకర్ అనే యువ దర్శకుడు చెప్పిన ఒక లవ్ స్టోరీని కూడా లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది.

అయితే ఈ సినిమాను మాత్రం కొత్త బ్యానర్ వారు నిర్మించడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అవుతోంది ప్రస్తుతం అక్కినేని - అల్లు అన్నదమ్ములు అలరించినట్టే దగ్గుబాటి బ్రదర్స్ కూడా విజిల్స్ వేయించడం ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు.