Begin typing your search above and press return to search.

రానా.. కూలీ నెంబర్ 1

By:  Tupaki Desk   |   10 Feb 2016 7:38 AM GMT
రానా.. కూలీ నెంబర్ 1
X
మంచు మోహన్ బాబు కుమార్తె లక్ష్మీ ప్రసన్న యాంకర్ గా ఓ వినూత్న కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ ఎపిసోడ్ కి సంబంధించి ప్రస్తుతం షూటింగ్ నిర్వహిస్తున్నారు. మేముసైతం అంటూ సామాజిక సేవా కోణంలో ఉండే ఈ కార్యక్రమం కోసం.. టాలీవుడ్ తారలు అంతా తమ వంతు సాయం చేస్తున్నారు.

ఇప్పటికే పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తో కూరగాయలు అమ్మించింది మంచు లక్ష్మి. కేపీహెచ్ బీ రైతుబజార్ లో కూరలమ్మింది హీరోయిన్. ఆ తర్వాత అక్కినేని నవతరం వారసుడు అఖిల్.. ఆటో డ్రైవర్ గా కూడా మారాడు. ఇప్పుడు వంతు దగ్గుబాటి వారసుడు రానా ది. ఆజానుబాహుడైన ఈ భల్లాలదేవుడు మూటలు మోసేశాడు. రైతు బజార్ లో కూరగాయల మూటలు మోసే కూలీ అవతారం ఎత్తాడు. డమ్మీ బ్యాగులు కాకుండా.. కొంతదూరంపాటు నిజంగానే కూరగాయల మోటలు మోయడం విశేషం. ఖాకీ డ్రస్ వేసి, ఎర్ర టవల్ కట్టి అచ్చంగా కూలీ అవతారంలో కనిపించడం విశేషం. ఇలా రానా ను చూస్తుంటే బాబాయ్ వెంకటేష్ నటించిన కూలీ నెంబర్1 ని గుర్తు చేశాడంటున్నా ఫ్యాన్స్.

ఈ కార్యక్రమం ద్వారా విరాళాలు సేకరించి.. వాటిని సమాజానికి ఉపయోగించాలన్నది దీని ఉద్దేశ్యం. తన కార్యక్రమంలో పాలుపంచుకుంటూ సాయం చేసిన రానాకు మంచు లక్ష్మి కృతజ్ఞతలు చెప్పింది. 'మేము సైతంలో భాగం అయినందుకు థాంక్యూ. నువ్వు మరింత స్ఫూర్తి కలిగించావు' అంటూ ట్వీట్ చేసిందీమె. ఒక ప్రోగ్రాం కోసం టాలీవుడ్ కుర్ర జరనేషన్ అంతా ఇలా విభిన్న గెటప్ లతో కనిపించడం విశేషంగానే చెప్పాలి.