Begin typing your search above and press return to search.

బోస్ గ్యాంగులో తెలుగు హీరో

By:  Tupaki Desk   |   12 Sep 2017 6:52 AM GMT
బోస్ గ్యాంగులో తెలుగు హీరో
X
దగ్గుబాటి రానా కెరీర్ ఇప్పుడు పీక్స్ లో ఉంది. ఘాజీ.. బాహుబలి.. నేనే రాజు నేనే మంత్రి ఇలా జోనర్లలోని సినిమాలతో సక్సెస్ లు కొట్టేస్తున్నాడు. రకరకాల కేరక్టర్లతో మెప్పించేస్తున్నాడు. సోలో హీరోగా కూడా రీసెంట్ గా సక్సెస్ అందుకున్న రానా.. ప్రస్తుతం సోషల్ మీడియాను కవర్ చేసేస్తున్నాడు. సోషల్ అనే టైటిల్ పై తెరకెక్కిన వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో నటిస్తున్నాడు రానా.

మరోవైపు ఓ పీరియాడికల్ మూవీ షూటింగ్ లో రానా బిజీగా ఉన్నాడు. ప్రతీ చిత్రాన్ని డిఫరెంట్ కాన్సెప్ట్ గా ఎంచుకుంటున్న ఈ దగ్గుబాటి హీరో.. స్వతంత్రానికి పూర్వం కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో ఏర్పాటయిన ఇండియన్ నేషనల్ ఆర్మీ సోల్జర్ పాత్రలో కనిపించనున్నాడట రానా. ఐఎన్ ఏ తరఫున పోరాడిన సైనికుని పాత్రలో కనిపించనున్నట్లు చెప్పాడు రానా. అలాగే సౌత్ ఈస్ట్ కి తమిళ.. బర్మాకు తెలుగు జనాలు కదిలిన సిట్యుయేషన్ గురించి డీటైల్డ్ గా ఈ సినిమాలో కనిపిస్తుందట. ఓ భారీ సెట్ ను ఈ చిత్రం కోసం నిర్మించగా.. ప్రస్తుతం అక్కడే షూటింగ్ జరుగుతోంది.

అయితే.. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ డ్యుయల్ రోల్ లో కనిపించిన మూవీ భారతీయుడు. ఈ సినిమాలో ఆ భారతీయుడు కూడా ఇండియన్ నేషనల్ ఆర్మీలో సభ్యుడే. పైగా బోస్ తో కలిపి కమల్ ను కూడా చూపించాడు శంకర్. ఇప్పుడు అలాంటి సైనికుడి పాత్రలోనే రానా కూడా కనిపించనున్నాడు. కానీ.. అది రెండు జనరేషన్స్ ను లింక్ చేస్తూ.. ఇప్పటి కాలంలో అవినీతిపై తీసిన సినిమా. రానా మాత్రం కంప్లీట్ గా పీరియాడికల్ ఫిలింలోనే కనిపించనున్నాడు. ఈ సినిమా కథాకాలం అంతా 1945 సమీపంలోనే ఉంటుంది.