బాబాయికి పంచె కట్టిన అబ్బాయి

Sun Aug 13 2017 22:52:39 GMT+0530 (IST)

కిందటి వారం విడుదలైన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా విజయంతో ఇప్పుడు రానా కొత్త ఉత్సాహంతో ఉన్నాడు. ఈ సినిమాను తన ముందు సినిమాలుతో పోల్చుకుంటే బిన్నంగానే ఉంది అనే చెప్పాలి. ఎంచుకున్న కథ కానీ ఈ సినిమా ప్రచారం కానీ అన్నీ కొత్తగా చేసి ఇప్పుడు దాని ఫలితాలును అనుభవిస్తున్నాడు. జోగేంద్ర పాత్రలో రానా చక్కగా ఒదిగి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఈ విజయాన్ని తన ఫ్యామిలితో పంచుకొని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమాలో రానా గెటప్ అతని తెల్లని పంచె మంచి ఫేమస్ అయ్యింది.

రానా ఈ సినిమాలో ఒక సన్నివేశంలో తన పంచెను పైకి కట్టి పొగరుగా చూసిన సంధర్భం ఉంటుంది. రానా చేసిన ఇదే సీన్ను తన బాబాయిచే చేయించి తన విజయాన్ని మరింత గొప్పగా మార్చుకున్నాడు. రానా తన ట్విటర్లో బాబాయి వెంకటేష్ తో కలిసి పంచె పైకి కట్టే సన్నివేశం చేసి దగ్గుబాటి అభిమానులుకు మంచి కనువిందు చేశారు. వెంకటేష్ ఈ వీడియోలో తనలో ఉన్న పొగరైన నటుడును చూపిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. రానా చేసిన జోగేంద్ర పాత్రను అనుసరించిన అందులో విక్టరీ వెంకీ మార్క్ స్పష్టoగా కనిపిస్తూనే ఉంది. నా విజయాన్ని నా బాబాయితో  ఇలా  పంచుకోవడం చాల సంతోషంగా ఉంది అని చెప్పాడు. నేను ఎంచుకున్న సినిమాలుకు ప్రేక్షకులు చూపిస్తున్న అభిమానానికి ఎప్పుడూ ఋణపడి ఉంటాను అని చెప్పాడు రానా.

రానా సినిమాలు సాదారణంగా కమర్షియల్ హిట్ అవ్వడం తక్కువనే చెప్పాలి కానీ ఈ సినిమా అందుకు మినహాయింపు అనాలి. బాహుబలి సినిమా రానా సినీ కెరియర్ని కొత్త మలుపు తిప్పింది. ఆ వెంటనే  ఘాజీ సినిమాతో వచ్చి అందరినీ ఆకట్టుకున్నాడు. నేనే రాజు నేనే మంత్రి సినిమాలో రానా కు జంటగా కాజల్ అగర్వాల్ నటించింది. మరో హీరోయిన్ క్యాథరీన్ త్రేసా కూడా  నటించి ఈ సినిమాకు కొంత అందం చేర్చింది.