Begin typing your search above and press return to search.

రానాకి అప్పుడే తెలిసొచ్చిందట

By:  Tupaki Desk   |   23 Jun 2017 4:52 AM GMT
రానాకి అప్పుడే తెలిసొచ్చిందట
X
భల్లాలదేవుడి పాత్రతో దేశమంతా గుర్తింపు సంపాదించుకున్న దగ్గుబాటి రానా.. ఇప్పుడు సోలో హీరోగా హిట్ కొట్టేందుకు గట్టిగానే ఫిక్స్ అయ్యాడు. మరోవైపు వ్యాపార విషయాల్లో కూడా రానా సూపర్ యాక్టివ్ అంటారు. మరోవైపు టెలివిజన్ రంగంలో కూడా సత్తా చాటేందుకు ఫిక్స్ అయిన రానా.. నెం.1 యారీ అనే టెలివిజన్ షోను హోస్ట్ చేయబోతున్నాడు.

'మొదటి రోజున ఎలాంటి ఆలోచనలు లేకుండా షూటింగ్ కి వెళ్లాను. కానీ వెళ్లిన కాసేపటికే నాకు విషయం అర్ధమైంది. ఇదేమీ అనుకున్నంత తేలిక కాదనే విషయం తెలిసొచ్చింది. సినిమాల్లో షూటింగ్ కి చాలా సమయం తీసుకుంటాం. కానీ టీవీకి వచ్చేసరికి.. ఒక్కో ఎపిసోడ్ పర్ఫెక్ట్ గా రావడం కోసం గంటల కొద్దీ సమయాన్ని గడపాల్సి ఉంటుంది. అది కూడా ఒకే చోట కూర్చుని ఉండాలి. ఇందుకోసం టీం అంతా ఎంతో కష్టపడాల్సి ఉంటుంది' అని చెప్పాడు రానా. టాలీవుడ్ స్టార్స్ ను తీసుకొచ్చి.. వారితో చిట్ చాట్ చేయడం ఈ షో కాన్సెప్ట్.

'మేం సహజంగా ఇలాంటివి చేస్తూనే ఉంటాం. కానీ ఇప్పుడదే టీవీలో చేయాలి అంతే' అంటూ నవ్వేశాడు రానా. 'సినిమాలకు వెళ్లేవారికి.. యాక్టర్స్ కు మధ్య కొంత అంతరం ఉంది. వాళ్ల అభిమాన తారల గురించి తెలుసుకోవాలని ప్రేక్షకుల్లో ఉత్సాహం ఉంది. ఈ రెండు విభాగాల మధ్య ఉన్న గ్యాప్ ను ఫిల్ చేసేందుకు నేను ప్రయత్నిస్తాను' అని చెప్పాడు రానా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/