Begin typing your search above and press return to search.

విష్ణు బార్గైనింగ్ తట్టుకోలేమంటున్న రమ్యకృష్ణ

By:  Tupaki Desk   |   29 Nov 2015 11:30 AM GMT
విష్ణు బార్గైనింగ్ తట్టుకోలేమంటున్న రమ్యకృష్ణ
X
మంచు విష్ణు రెమ్యూనరేషన్ విషయంలో తెగ ఇబ్బంది పెట్టేశాడని అంటోంది అందాల తార రమ్యకృష్ణ. అలాగని అతను ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోమని మొహమాట పెట్టేశాడని అనుకుంటే పొరబాటే. పారితోషకం విషయంలో మరీ బార్గైనింగ్ చేసి ఇబ్బంది పెట్టేశాడట విష్ణు. మంచు ఫ్యామిలీ బ్యానర్ లో ఇంకో సినిమా కోసం తనకు మళ్లీ ఫోన్ చేయొద్దు అని రమ్యకృష్ణ తనకు గట్టిగా చెప్పిందంటూ ‘మామ మంచు అల్లుడు కంచు’ ఆడియో ఫంక్షన్ లో ఆసక్తికర విషయం వెల్లడించాడు విష్ణు. దీనికి కారణం చెబుతూ.. ‘‘రెమ్యూనరేషన్ విషయంలో నువ్వు మీ నాన్న కంటే ఎక్కువ బార్గైనింగ్ చేస్తున్నావు. ఇంకోసారి మీ బేనర్ లో సినిమా అంటే వేరే వాళ్లతో ఫోన్ చేయించు అని రమ్యకృష్ణగారు ఖరాఖండిగా చెప్పేశారు’’ అన్నాడు విష్ణు.

ఐతే రమ్యకృష్ణ అద్భుతమైన నటి అని.. తనకు తెలిసి స్విమ్ సూట్ ఆమెకు సూటైనట్లు ఇంకెవ్వరికీ సెట్టవదని తనదైన శైలిలో కామెంట్ చేశాడు విష్ణు. ఇక రమ్యకృష్ణ గురించి మోహన్ బాబు మాట్లాడుతూ.. ‘‘అల్లరి మొగుడు లాంటి సినిమాలో నటించడం తన అదృష్టం అని చెబుతుంటుంది రమ్య. కానీ ఆ సినిమాలో నటించడం నా అదృష్టమేమో. రమ్యకృష్ణ నటించడం వల్లే ఆ సినిమా బాగా ఆడిందేమో. ఒకప్పుడు ఎవరైతే రమ్యకృష్ణను కాదన్నారో వాళ్లే తర్వాత తన డేట్ల కోసం ఎగబడ్డారు, ఇప్పటికీ పడుతున్నారు. రమ్యతో పాటు మీనా కూడా మంచి నటి. వాళ్లిద్దరూ నాకు బంగారం. ఇప్పటి హీరోయిన్లు ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నారు. కానీ వీళ్లిద్దరూ మాత్రం ఎప్పుడూ అలాగే ఉన్నారు’’ అన్నాడు మోహన్ బాబు.